AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగంతో వాహనాలపై దూసుకెళ్లిన బస్సు.. 8మంది మృతి

స్పీడ్ కంట్రోల్ కాలేదో... లేక ఇంజిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్‌ వచ్చిందో తెలీదు కానీ తమిళనాడులో పట్టపగలు వణుకుపుట్టించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ దృశ్యాలు దడ పుట్టిస్తున్నాయి. సేలంలోని అరియనూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని, సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగంతో వాహనాలపై దూసుకెళ్లిన బస్సు.. 8మంది మృతి
Road Accident, Salem
Balaraju Goud
|

Updated on: Mar 20, 2026 | 4:19 PM

Share

స్పీడ్ కంట్రోల్ కాలేదో… లేక ఇంజిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్‌ వచ్చిందో తెలీదు కానీ తమిళనాడులో పట్టపగలు వణుకుపుట్టించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీటీవీ దృశ్యాలు దడ పుట్టిస్తున్నాయి. సేలంలోని అరియనూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని, సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై అరియనూర్ సమీపంలో ఒక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రయాణిస్తుండగా, డ్రైవర్ అనుకోకుండా బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటి ఎదురుగా వేగంగా దూసుకెళ్లింది బస్సు. అతివేగంతో ప్రయాణిస్తున్న ఆ బస్సు, ఎదురుగా వస్తున్న ఒక మినీ వ్యాన్, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్ని వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే నలిగిపోయి మరణించారు. ప్రమాదంలో గాయపడిన 10 మందికి పైగా సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 8కి పెరిగింది. మృతులలో మినీ వ్యాన్‌లో ఉన్న ఐదుగురితో పాటు.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కొండలంబట్టి, మగుడంజవాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సేలం ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us