RAHUL EFFECT: రాహుల్ పర్యటన తర్వాత టీ.కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం.. పల్లెబాట పట్టనున్న నేతలు.. టీపీసీసీ కార్యాచరణ హైలైట్స్ ఇవే!
టీపీసీసీ కూడా ప్రత్యేక ప్రణాళికతో రెండేసి మండలాలకు ఒక నేతను బాధ్యునిగా చేస్తూ పల్లెబాట నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం వున్నప్పటికీ కేసీఆర్ వ్యూహాలు ఎలా వుంటాయో తెలియదు కాబట్టి తాము సకల యత్నాలతో సంసిద్దంగా వుండాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా తీర్మానించినట్లు సమాచారం.
RAHUL EFFECT ON TELANGANA CONGRESS LEADERS TO TAKE UP VILLAGE TOURS: రాహుల్ గాంధీ ఉపదేశమో లేక ప్రజల్లో లేకుంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకదనుకుంటున్నారో ఏమో గానీ.. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల్లో సంచరించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము జనంలో వున్నామని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పాదయాత్రలు, కమ్యూనిటీ సమావేశాలతో ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. చాలా మంది పల్లెబాట పట్టేలా ప్లాన్ చేసుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆమోదం కోసం యత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అదేసమయంలో టీపీసీసీ TPCC కూడా ప్రత్యేక ప్రణాళికతో రెండేసి మండలాలకు ఒక నేతను బాధ్యునిగా చేస్తూ పల్లెబాట నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం వున్నప్పటికీ కేసీఆర్వ్యూ KCRహాలు ఎలా వుంటాయో తెలియదు కాబట్టి తాము సకల యత్నాలతో సంసిద్దంగా వుండాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా తీర్మానించినట్లు సమాచారం.
తెలంగాణలో రాజకీయం గత కొంత కాలంగా హాట్ హాట్‌గా మారిపోయింది. సభలు,పాదయాత్రలు, ప్రత్యర్థి పార్టీల మధ్య వాడీవేడి వాగ్బాణాలు సంధించుకోవడం కనిపిస్తోంది. దానికి తగినట్లుగానే మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలను ఎప్పటికప్పుడు పదునెక్కిస్తున్నాయి. అందులో భాగంగా పలు అంశాలపై ఎవరికెవరు తీసిపోకుండా విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు. ప్రత్యర్థుల కామెంట్లపై వెనువెంటనే స్పందిస్తున్నారు. అదేసమయంలో రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్ పార్టీ CONGRESS PARTY లు తెలంగాణలో పాగా వేసేందుకు యత్నాలను ముమ్మరం చేశాయి. టీ.బీజేపీ అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు విడతలుగా ప్రజల్లోకి వెళ్ళారు. రెండో విడత యాత్రను ఆయన ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. మధ్యమధ్యలో చాలా మంది జాతీయ నేతలను తన యాత్రలో పాలుపంచుకునేలా సంజయ్(Bandi Sanjay) ప్లాన్ చేశారు. రెండో విడత యాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా(Rangareddy District) మహేశ్వరం సమీపంలో నిర్వహించనున్న బహిరంగసభతో ముగియనున్నది. దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తామేమీ తక్కవ తినలేదన్నట్లుగా ప్రజల్లోకి వెళుతున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఖమ్మం(Khammam) జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతూ పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు మార్కెట్ యార్డులను, కల్లాలను సందర్శిస్తున్నారు. అదేసమయంలో తమకు గతంలో కలిసొచ్చిన వరంగల్ వేదికగానే వచ్చే ఎన్నికలకు తొలి సమర శంఖారావాన్ని పూరించారు. దానికి పార్టీ అధినేత రాహుల్ గాంధీని రప్పించారు. మే 6వ తేదీన హన్మకొండ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన రాహుల్ సభకు జనం తండోపతండాలుగా వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నేతల్లో రాహుల్ గాంధీ పర్యటన కొత్త ఉత్సాహం నింపింది. వరంగల్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఎన్నికలకు చాలా ముందస్తుగానే హామీలను గుప్పించారు. తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే రైతాంగానికి రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ, ఎకరాకు 15 వేల రూపాయల వరకు నగదు సాయం, రీజనబుల్‌గా కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. తమది కేవలం డిక్లరేషన్ మాత్రమే కాదని.. గ్యారెంటీడ్ అస్యూరెన్స్ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అదేసమయంలో పార్టీ వర్గాలకు కూడా క్లియర్ కట్ సందేశం కమ్ హెచ్చరికను జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎగబడడం కాదని, ప్రజల్లో వున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని ఓరుగల్లు సభా వేదిక నుంచే ప్రకటించేశారు. ఈ ప్రకటన టీ.కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అధినేత చెప్పారు కాబట్టి ప్రజల్లో లేకపోతే తమకు టిక్కెట్లు రావని గుర్తించారు టీ.నేతలు. గుర్తించడమే కాదు.. కార్యాచారణను కూడా సిద్దం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పల్లె బాట పట్టాలని డిసైడ్ అయ్యారు. వరంగల్(Warangal) లో ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ని ఆధారం చేసుకుని జనంలోకి వెళ్లాలని తలపెట్టారు. వరంగల్ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్ళాలని రాహుల్ గాంధీ ఆదేశించడంతో అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
రైతుల కోసం ప్రకటించిన డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు టీపీసీసీ ప్రణాళిక రెడీ చేస్తోంది. ఒకసారి టీపీసీసీ గ్రీన్ సిగ్నల్ GREEN SIGNAL ఇచ్చేస్తే ఇక జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. మే 16వ తేదీన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతోంది. వచ్చే 100 రోజుల్లో డిక్లరేషన్‌పై కార్యాచరణకు ఉండాలని చెప్పిన నేపథ్యంలో అందుకు యాక్షన్ ప్లాన్‌ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో ఫైనల్ చేయబోతున్నారు. ఈ సమావేశంలో పాలుపంచుకోవాలని పీఏసీ సభ్యులతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులకు కూడా సమాచారం పంపాలని తాజాగా టీపీసీసీ నిర్ణయించింది. మే 21 నుండి ప్రతి నాయకుడు పల్లె బాట పట్టాలని టీపీసీసీ అదేశించబోతున్నట్లు తెలుస్తోంది. పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో కార్యాచరణ చేపట్టబోతున్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పల్లెబాట నిర్వహించనున్నారు. పల్లెబాట కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలను వేయనున్నారు. సుమారు 300 మంది నాయకులతో డిక్లరేషన్ అంశాలను జనంలో విరివిగా ప్రచారం చేయాలని తలపెట్టారు. రెండేసి మండలాలకు ఓ సీనియర్ నేతను నియమించడంతోపాటు ఆ నాయకుడు..కనీసం 30 గ్రామాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. వీరితో పాటు పార్టీలో ముఖ్య నాయకులను కూడా జిల్లాల వారీగా విభజించి, వారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. పల్లెబాట కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు.. రెగ్యులర్‌గా సమావేశాలు పెట్టి.. అప్పటి పొలిటికల్ సిచ్యుయేషన్‌కు అనుగుణంగా తమ కార్యాచరణలో తగిన మార్పులను చేయాలని టీపీసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.