AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Trap: హనీ ట్రాప్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి.. పాకిస్తాన్‌ ఏజెంట్‌కు కీలక సమాచారం చేరవేత..

Honey Trap: భారత్‌పై పాకిస్తాన్‌ తన వంకర బుద్ధిని చాటుతూనే ఉంది. నేరుగా ఎదుర్కోలేక గూఢచర్యంతో దేశాన్ని దెబ్బ కొట్టే కుట్రలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే హనీ ట్రాప్‌ ద్వారా అమ్మాయిలను ఎరవేస్తూ దేశ భద్రతకు సంబంధించిన వివరాలను..

Honey Trap: హనీ ట్రాప్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి.. పాకిస్తాన్‌ ఏజెంట్‌కు కీలక సమాచారం చేరవేత..
Narender Vaitla
|

Updated on: May 12, 2022 | 5:25 PM

Share

Honey Trap: భారత్‌పై పాకిస్తాన్‌ తన వంకర బుద్ధిని చాటుతూనే ఉంది. నేరుగా ఎదుర్కోలేక గూఢచర్యంతో దేశాన్ని దెబ్బ కొట్టే కుట్రలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే హనీ ట్రాప్‌ ద్వారా అమ్మాయిలను ఎరవేస్తూ దేశ భద్రతకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హనీ ట్రాప్‌కు సంబంధించిన పలు ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. గూఢచర్యం ఆరోపణలతో వైమానిక దళ అధికారి దేవేంద్ర శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సుబ్రోటో పార్క్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రికార్డ్‌ ఆఫీస్‌లో ఆడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ శర్మకు పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. అనంతరం దేవేందర్‌పై వలపు వల విసిరిన సదరు యువతి దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. దేవేందర్‌ నుంచి ఉన్నతాధికారుల పేర్లు, చిరునామాలు, ఏఐఎఫ్ లొకేషన్లు, రాడార్లు సమాచారాన్ని రాబట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతేకాకుండా లీక్‌ చేసిన సమాచారానికి దేవేందర్‌ శర్మ ఏంజెంట్‌ నుంచి డబ్బు కూడా అందుకున్నాడని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు దేవెంద్ర శర్మను అరెస్ట్‌ చేసి సర్వీసు నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే దేవేంద్ర శర్మ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కాన్పూర్. ఫేస్‌బుక్‌లో పరిచయమైన సదరు యువతి ఇండియాకు చెందిన సిమ్‌ కార్డుతోనే శర్మతో సంప్రదింపులు జరిగిపింది. అయితే ప్రస్తుతం ఈ సిమ్‌ యాక్టివేట్‌లో లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..