AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: యాచక బాలుడిని గొంతు నులిమి హత్య.. షాకింగ్ రీజన్ చెప్పిన పోలీస్ కానిస్టేబుల్..

ఓ పోలీసు సహనం అన్న మాటను మరచిపోయి.. తనను డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ.. ఓ చిన్నారి బాలుడిని ఏకంగా హత్య చేశాడు. అంతేకాదు తాను చేసిన దారుణం వెలుగులోకి వస్తుందని.. బాలుడి మృత దేశాన్ని దూరంగా పడేశాడు

Crime News: యాచక బాలుడిని గొంతు నులిమి హత్య.. షాకింగ్ రీజన్ చెప్పిన పోలీస్ కానిస్టేబుల్..
Madhya Pradesh
Surya Kala
|

Updated on: May 12, 2022 | 8:22 PM

Share

Madhya Pradesh: పోలీసులు.. సమాజంలో అన్యాయాలను అక్రమాలను అరికట్టి.. ప్రజలకు అండగా నిలబడతారు. మంచిని, మానవత్వాన్ని సహనాన్ని కలిగి ఉంటారని పలు సందర్భాల్లో కూడా వెల్లడైంది. అయితే ఓ పోలీసు సహనం అన్న మాటను మరచిపోయి.. తనను డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ.. ఓ చిన్నారి బాలుడిని ఏకంగా హత్య చేశాడు. అంతేకాదు తాను చేసిన దారుణం వెలుగులోకి వస్తుందని.. బాలుడి మృత దేశాన్ని దూరంగా పడేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో(Datia dist) మే 5వ తేదీన చోటు చేసుకుంది. బుధవారం(మే 11న) హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అనంతరం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

దతియా జిల్లా ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్.. కేసు వివరాలను వెల్లడిస్తూ.. గ్వాలియర్ లో ఆరేళ్ల నిరుపేద బాలుడు . గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవి శర్మ ని ఆకలి వేస్తుందంటూ పదే పదే డబ్బు అడిగాడు… అయితే తనను విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని రవి శర్మ హత్య చేసిన ఆ మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి పొరుగున ఉన్న గ్వాలియర్‌లోని ఏకాంత ప్రదేశంలో పడేశాడని తెలిపారు. ఈ ఘటన గత గురువారం జరగ్గా, గ్వాలియర్‌లోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రవిశర్మను అరెస్టు చేశామని ఎస్పీ విలేకరులకు తెలిపారు. అయితే రవి శర్మ.. తాను ఎప్పటి నుంచో డిప్రెషన్‌తో బాధపడుతున్నానని,.. బాలుడు తనను డబ్బు పదే పదే అడగడంతో చిరాకు పడ్డానని పోలీసులకు తెలిపాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి

దాతియా నివాసి సంజీవ్ సేన్ తన కుమారుడు మయాంక్ (6)ని మే 5వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్వాలియర్‌లోని వివేకానంద చౌరాహా ప్రాంతంలో బాలుడి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత మృతదేహం మయాంక్‌దేనని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఆధారంగా పోలీసులు మరింత లోతుగా కేసుని విచారించారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రవి శర్మ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపగా..తానే బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. దాతియాలోని పంచశీల్ నగర్‌లో విధులు నిర్వహిస్తుండగా, బాలుడు పదే పదే అతని వద్దకు వచ్చి డబ్బులు అడిగాడు. నిందితుడు విసుగు చెంది, బాలుడిని తన కారు దగ్గరికి తీసుకెళ్లి, ఆపై గొంతుకోసి చంపాడని రాథోడ్ చెప్పారు. శర్మ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.  రవిశర్మను ఇప్పటికే విధుల నుంచి తొలగించి అతన్ని అరెస్ట్ చేశామని ఎస్పీ అమన్ సింగ్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కిశోరం ఇక్కడ క్లిక్ చేయండి..