AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajesh Sharma

Rajesh Sharma

Author - TV9 Telugu

raaj.shetpally@tv9.com

26 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్ళు. ఆ తర్వాత 1999 జనవరి మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా మొదలైన జర్నలిజం జర్నీలో జెమిని, తేజ, మాటీవీ, ఎస్వీబీసీ, టీవీ5, 6టీవీలలో పని చేసి.. ప్రస్తుతం టీవీ9లో 2015 నుంచి సీనియర్ లెవెల్‌లో విధినిర్వహణ. డిజిటల్ విభాగంలో ఏడాదిన్నరగా కంటెంట్ ఎడిటర్‌గా విధి నిర్వహణ.

Read More
Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?

Hyderabad Real-Estate: మొన్న కోకాపేట.. నిన్న బుద్వేల్.. భూములకు ఎక్కడా లేని డిమాండ్.. రియల్ బూమ్ తట్టుకోగలమా?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. పశ్చిమ, నైరుతీ హైదరాబాద్ నగర శివార్లు ఐటీ సంస్థల ఏర్పాటుతో న్యూయార్క్ వంటి సిటీలను తలపించేలా అభివృద్ధి చెందింది. పదుల సంఖ్యలో నిర్మాణమైన ఫ్లై ఓవర్లతో మాధాపూర్, మైండ్ స్పేస్, కొండాపూర్; గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రామ్‌గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొల్లూరు, వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి, నార్సింగి వంటి ప్రాంతాల రూపురేఖలు గత తొమ్మిదేళ్ళలో సమూలంగా మారిపోయాయి.

Telangana Elections: సొంత నివేదికలు.. సర్వే రిపోర్టులు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

Telangana Elections: సొంత నివేదికలు.. సర్వే రిపోర్టులు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితాలను విడుదల చేయాలని తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలు రెడీ అవుతున్నారు. ఇందుకు పార్టీలో అంతర్గతంగా బేరీజు వేసుకునే ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రైవేటు సర్వేలను నమ్ముకుంటున్నారు. వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల జాబితాను సిద్దం చేస్తున్న ప్రధాన పార్టీలు వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.