విశాఖపట్నం స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ పదికి పైగా పాములను జనావాసాల నుండి రక్షించి వార్తల్లో నిలిచారు. కూర్మన్నపాలెం, అగనంపూడిలో ఐదు భారీ నాగుపాములు, పొడవైన జెర్రిగొడ్డులను పట్టుకున్నారు. 6-8 అడుగుల పాములను అడవిలో విడిచిపెట్టిన వీడియో వైరల్ అయ్యింది. ప్రజల భయాలను తొలగిస్తున్న కిరణ్ కుమార్ కు ఈ ఏడాది ఉగాది పురస్కారం లభించింది.