ACలను 24 డిగ్రీల వద్ద వినియోగిస్తే విద్యుత్‌ ఆదా అవుతుంది? బీఈఈ ప్రకటన

21 April 2025

Subhash

సమ్మర్‌ సీజన్‌లో ఎయిర్‌ కండీషనర్‌ల (AC)ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంటుంది. చాలా మంది ఏసీల ముందు వాలిపోతుంటారు.

 సమ్మర్‌ సీజన్‌లో

ఎయిర్ కండీషనర్‌ వాడకం గురించి తప్పకుండా తెలిసి ఉండాలి. లేకుంటే విద్యుత్‌ బిల్లు పెరిగిపోయే అవకాశం ఉంది.

ఎయిర్ కండీషనర్‌ వాడకం

 గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్‌ వినియోగంలో 6 శాతం ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. 

గృహ, వాణిజ్య సంస్థలు 

దీని కారణంగా సంవత్సరానిక సుమారు 20 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని బీఈఈ వెల్లడించింది.

విద్యుత్‌ ఆదా

ఫలితంగా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఓ ప్రకటన విడుదల చేసింది. 

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ

సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తుంటారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్, ఆఫీస్‌లలో 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుంది.

24 డిగ్రీలు

అలాగే ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో కూడా ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుందని, దీని వల్ల ఏసీల జీవితకాలం పెరుగుతుందట.

ఏసీల జీవితకాలం

ఇలాంటి విషయాలపై మరింతగా అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించినట్లు బీఈఈ తెలిపింది.

ప్రచారం నిర్వహించాలి