17 April 2025
Subhash
భారత్‌లో బంగారానికి పన్ను కూడా విధిస్తారు. దీంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది. అందుకే చాలా మంది దుబాయ్ నుంచి భారత్‌కు బంగారాన్ని తీసుకువస్తారు. అక్కడ ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
దుబాయ్ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకురావచ్చు? ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్న భారతీయుడు లగేజీలో 20 గ్రాముల వరకు సుంకం లేకుండా అభరణాలు తీసుకురావచ్చు.
ఎటువంటి ట్యాక్స్ లేకుండా రూ.50 వేల వరకు లేదా రూ.40 గ్రాముల విలువైన అభరణాలు తెచ్చేందుకు అనుమతి ఉంది. అంటే లక్ష విలువైనది. ఇది మహిళా ప్రయాణికులకు మాత్రమే.
భారతదేశానికి వచ్చే ప్రయాణికులు నిర్ధేశించిన పరిమితి కంటే ఎక్కువ బంగారు అభరణాలను తీసుకెళితే కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
బంగారం కొనుగోలుకు సరైన రశీదు ఉండాలి. బంగారం స్వచ్ఛత, నాణ్యత ధృవీకరణ పత్రం. అలాగే బంగారు కడ్డీని తీసుకువస్తుంటే, ఆ కడ్డీలో దాని బరువు, సీరియల్ నంబర్ వంటి సమాచారం ఉండాలి.
ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో నివసించిన పిల్లలు దుబాయ్ నుండి పన్ను రహిత బంగారు ఆభరణాలను తీసుకోవచ్చు.
ఒక వ్యక్తి దుబాయ్ నుండి కస్టమ్ డ్యూటీ లేకుండా గరిష్టంగా రూ. 50,000 వరకు (20 గ్రాములు) బంగారాన్ని తీసుకురావచ్చు.పరిమితిని మించి ఉంటే కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
దుబాయ్ నుండి భారతదేశానికి బంగారాన్ని తీసుకువస్తుంటే, కస్టమ్స్ అధికారులకు చూపించడానికి మీ వద్ద కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉండాలి. లేకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.