మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..
సాధారణంగా సినీరంగంలో ఒక హీరో మిస్సైన సినిమాను మరో చేయడం సహజం. కొన్నిసార్లు ఒక హీరో ఖాతాలో పడాల్సిన హిట్స్ మరో హీరోకు చేరుతుంది. అలాగే కొన్ని డిజాస్టర్స్ సైతం అందుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అలాంటిందే. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన ఓ సినిమా అనుకోకుండా రామ్ చరణ్ వద్దకు చేరింది.
పైగా ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ సినిమానే ఎవడు! వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాను.. మొదట మహేష్ బాబుతో తీయాలని భావించారట డైరెక్టర్ వంశీ. అయితే అప్పటికే వరుస సినిమాలతో మహేష్ బాబు బిజీగా ఉండడంతో రెండేళ్లు సమయం పడుతుందని తెలిసిందట. మహేష్ బాబు హీరోగా.. జూనియర్ ఎన్టీఆర్ ను అతిథి పాత్రలో తీసుకోవాలని భావించారట. కానీ ఆ సమయంలో తారక్ ఈ గెస్ట్ రోల్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదట. దీంతో ఈ సినిమా రామ్ చరణ్ వద్దకు చేరిందట. ఈ సినిమాలో మహేష్ బాబు స్థానంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కాజల్, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు రామ్ చరణ్ పెద్ది మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

