Samantha: సమంత షాకింగ్ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురైన పలు సంఘటనల తర్వాత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, మహిళల సంరక్షణపై గత కొంతకాలంగా నెటిజన్లకు సందేశాలు ఇస్తున్నారు నటి సమంత. బంధాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో వచ్చే పోస్టులను ఆమె లైక్ లేదా షేర్ చేస్తున్నారు. తాజాగా వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్‌మీడియా పోస్ట్‌ను లైక్ చేశారు.
అనారోగ్యంతో ఉన్న భార్యలను వదిలించుకోవడానికే భర్తలు మొగ్గు చూపుతున్నారనే సర్వే గురించి ఉన్న ఈ పోస్ట్‌ను సమంత ఎందుకు లైక్ చేసింది అన్న విషయం చర్చనీయాంశమైంది. సక్సెస్ వెర్స్ అనే ఇన్‌స్టా ఎకౌంట్లో ఆరోగ్యం, అనుబంధం వంటి విషయాలపై తరచూ ఆసక్తికరమైన పోస్టులు వస్తుంటాయి. వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల ఆ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే పురుషుడు ఆమెను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే మహిళలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తాజా సర్వే ద్వారా ఇది నిరూపితమైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సర్వేలో తేలింది’’ అనేది ఆ పోస్ట్ సారాంశం. దీనిని నటి సమంతతోపాటు సుమారు 60 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. సమంత ఇలాంటి పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..
Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

