బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్ న్యూస్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ కూడా రుణాలపై వడ్డీరేటును అంతేస్థాయిలో కోత పెట్టింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 8.25 శాతానికి దిగొచ్చింది.
దీంతోపాటు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటును అంతే స్థాయిలో తగ్గించడంతో రేటు 8.65 శాతానికి దించింది. తగ్గించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా ఏడాది నుంచి రెండేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేటు 6.8 శాతం నుంచి 6.7 శాతానికి దిగింది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని కూడా 6.9 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 7 శాతంగా ఉన్నది. మరోవైపు, 444 రోజుల కాలపరిమితితో కూడిన ప్రత్యేక డిపాజిట్ స్కీం అమృత్ వృష్టి స్కీంను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంపై 7.05 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటుని పావు శాతం తగ్గించడంతో రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం నుంచి 8.80 శాతానికి దిగొచ్చింది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ కూడా బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు 9.10 శాతం నుంచి 8.85 శాతానికి దిగిరానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
Samantha: సమంత షాకింగ్ ?? భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రామ్ చరణ్..
Rashmi Gautam: తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి

వీడు ఎవడండీ బాబూ... 77 సార్లు 100కి కాల్ చేసిన తాగుబోతు వీడియో

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

విభిన్నంగా పెళ్లి పిలుపు - ఆ మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఎలా..?

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

కొడుకు చేతికి ఫోన్ ఇస్తే..తల్లికే చుక్కలు చూపెట్టాడుగా వీడియో
