AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best smartphone: ఈ ఫోన్స్ ఉంటే కెమెరా వద్దంతారంతే.. రూ.30 వేలల్లో ది బెస్ట్ ఫోన్స్ ఇవే..!

మన జీవితంలో గడిచిన ఒక్క క్షణాన్ని కూడా ఎప్పుడూ వెనక్కి తీసుకురాలేం. ఎంత డబ్బున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఇది మాత్రం సాధ్యం కాదు. అయితే గడిచిన రోజులోని మధుర సంఘటనలను మాత్రం ఫొటో రూపంలో చూసుకోవచ్చు. అందుకే ఫొటోకు ఎంతో విలువ ఉంటుంది. గతంలో ఫోటోలు తీసుకోవాలంటే స్డూడియోలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటిలోని కెమెరాతో ఎక్కడబడితే అక్కడ ఫొటోలు తీసుకునే వెసులుబాటు లభించింది. కెమెరా మంచిదైతే నాణ్యమైన ఫొటోలు వస్తాయి. ఏప్రిల్ నెలలో మార్కెట్ లోకి రూ.30 వేల ధరలో అనేక స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. వాటిలో మంచి కెమెరా, డిస్ ప్లే, బ్యాటరీ కలిగిన వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Apr 22, 2025 | 6:00 PM

Share
ఐక్యూ నియో 10ఆర్ స్మార్ట్ ఫోన్ లో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఆకట్టుకుంటోంది. దీనిలో 6400 ఎంఏహెచ్ బ్యాటరీని 80 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్ ను ఐదేళ్లు ఉపయోగించిన తర్వాత కూడా బ్యాటరీ 80 శాతానికి పైగా చార్జింగ్ నిలుపుకొంటుందని కంపెనీ తెలిపింది. దీనిలో 6.78 అంగుళాల అమోలెడ్ ప్యానల్, స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు.  కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా బాగున్నాయి.

1 / 5
శక్తివంతమైన విజువల్స్, సున్నితమైన స్క్రోలింగ్ అందించడం వన్ ప్లస్ నార్డ్ 4 ప్రత్యేకత. 6.74 అంగుళాల ఫుల్ హెచ్ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్ సెట్, ఆక్టా కోర్ సెటప్, 8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని 5500 ఎంఏహెచ్ బ్యాటరీని సూపర్ వూక్ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన సెన్సార్, 8 ఎంపీ సెకండరీ షూటర్, సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా బాగున్నాయి.

2 / 5
ఒప్పో ఎఫ్ 29 ప్రో 5 జీ స్మార్ట్ ఫోన్ లో ఫొటోగ్రఫీ కోసం 50 ఎంపీ ప్రధాన కెమెరా అమర్చారు. దీనికి 2 ఎంపీ డెప్త్ కెమెరా మద్దతు ఇస్తుంది. ముందు భాగంలోని 16 ఎంపీ కెమెరాతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్, దుమ్ము నీటి నుంచి రక్షణకు ఐపీ 66, 68, 69 టెక్నాలజీ, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్ బాగున్నాయి.

3 / 5
వేగవంతమైన పనితీరు కలిగిన స్మార్ట్ ఫోన్లలో పోకో ఎక్స్ 7 5జీ ఒకటి. దీనిలో 6.73 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. బయట ఉన్నప్పుడు కూడా దీనిలో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. డిస్ ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐతో రక్షణ కల్పించారు. గేమింగ్ ఆడుకునేవారికి సైతం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8400 ఆల్ట్రా చిప్ సెట్, 6550 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ బాగున్నాయి. 90 డబ్ల్యూ హైపర్ చార్జర్ తో కేవలం 47 నిమిషాల్లోనే ఫోన్ ను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ముందు భాగంలో 50 ఎంపీ సోనీ ప్రధాన సెన్సార్ అమర్చారు. దీనితో పాటు 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 20 ఎంపీ సెల్పీ షూటర్ అమర్చారు.

4 / 5
ఫొటోగ్రఫీ ప్రియులకు ఎంతో ఉపయోగపడే ఫోన్లలో రియల్ మీ పి 3 అల్ట్రా 5 జీ ముందు వరుసలో ఉంటుంది. దీనిలో 6.83 అంగుళాల 1.5 కె క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. మీడియా టెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్ సెట్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్ మి యూఐ 6.0పై నడుస్తుంది. ఫొటోగ్రఫీ కోసం పీ3 అల్ట్రా 5 జీ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణ. 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, సెల్పీలు వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు.

5 / 5