- Telugu News Photo Gallery Technology photos Safety Tips To Be Follow While You are at the Petrol Pump
Tech Tips: మీ వాహనంలో పెట్రోల్ వేయిస్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Tech Tips: బైక్, కార్లలో పెట్రోల్ నింపేటప్పుడు చేసే కొన్ని సాధారణ తప్పులు మీ కారు, బైక్ ఇంజిన్‌పై ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియకుండానే ఈ అజాగ్రత్తగా ఉంటారు. ఇది ఇంజిన్ పనితీరు, మైలేజీని ప్రభావితం చేస్తుంది. ఐదు సాధారణ తప్పులు ఏమిటి..?
Updated on: Apr 22, 2025 | 9:38 PM

పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వేచి ఉండటం హానికరం. ఎందుకంటే పెట్రోల్-డీజిల్ ట్యాంక్‌లో మురికి ఉంటుంది. పెట్రోల్ దాదాపు అయిపోయిన తర్వాత ఈ వ్యర్థాలు వాహనానికి పెట్రోల్ సరఫరా అయ్యే పంప్ ద్వారా ఇంజిన్‌లోకి వెళ్తుంది. ఆ వ్యర్థాల ద్వారా ఫిల్టర్ మూసుకుపోతుంది. దీని వల్ల వాహనంలో సమస్యలు తలెత్త అవకాశం ఉంది.



కొంత మంది పెట్రోల్ ట్యాంక్‌ని నిత్యం నిండుగా ఉంచేందుకు పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతూనే ఉంటారు. ఇది ఓవర్‌ఫిల్లింగ్‌కు దారితీస్తుంది. ఇది వెంట్ సిస్టమ్‌లోకి ఇంధనం లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది హడావుడిగా పెట్రోల్ నింపుకునేటప్పుడు ఇంజన్ ఆన్‌లో ఉంచుతుంటారు. భద్రతా కోణం నుండి ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది మైలేజీని ప్రభావితం చేస్తుంది. ఇది ఇంజిన్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు.




