AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krunal Pandya : ఆర్సీబీ కి దొరికిన అసలైన వజ్రం..63 బంతుల్లో సెంచరీ..18 ఫోర్లతో గ్రౌండ్‌ను క్లీన్ స్వీప్ చేసేశాడు

Krunal Pandya : రాజ్‌కోట్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కృణాల్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 18 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 173.03 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ బరోడా స్కోరును 417 పరుగుల హిమాలయ శిఖరానికి చేర్చాడు.

Krunal Pandya : ఆర్సీబీ కి దొరికిన అసలైన వజ్రం..63 బంతుల్లో సెంచరీ..18 ఫోర్లతో గ్రౌండ్‌ను క్లీన్ స్వీప్ చేసేశాడు
Krunal Pandya
Rakesh
|

Updated on: Dec 31, 2025 | 5:30 PM

Share

Krunal Pandya : విజయ్ హజారే ట్రోఫీలో బరోడా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యా శివమెత్తాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన భీకర ఫామ్‌తో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపాడు. కేవలం 63 బంతుల్లోనే అజేయ సెంచరీతో విరుచుకుపడి, హైదరాబాద్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ కృణాల్ ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్నాడు.

63 బంతుల్లోనే సెంచరీ మార్క్

రాజ్‌కోట్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కృణాల్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 18 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 173.03 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ బరోడా స్కోరును 417 పరుగుల హిమాలయ శిఖరానికి చేర్చాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం కృణాల్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది అతనికి లిస్ట్-ఏ కెరీర్‌లో మూడో సెంచరీ.

మూడు మ్యాచ్‌ల్లో 248 పరుగులు

కృణాల్ పాండ్యా గత మూడు ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే అతను ఏ రేంజ్‌లో ఊపుమీద ఉన్నాడో అర్థమవుతుంది. బెంగాల్‌పై 57 పరుగులు, ఉత్తరప్రదేశ్‌పై 82 పరుగులు చేసిన కృణాల్, ఇప్పుడు హైదరాబాద్‌పై సెంచరీ బాదాడు. మొత్తంగా గత మూడు మ్యాచ్‌ల్లోనే 248 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో మొత్తం 34 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ రాణిస్తున్న కృణాల్, తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఐపీఎల్ 2026 వేలంలో తనను కొనుగోలు చేసిన ఆర్సీబీ యాజమాన్యాన్ని ఫుల్ హ్యాపీ చేస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో కృణాల్ ఒక్కడే కాదు, బరోడా బ్యాటర్లు నిత్య పాండ్యా, అమిత్ పాసి కూడా సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు ఏకంగా 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అమిత్ పాసి 127 పరుగులు చేయగా, నిత్య పాండ్యా 122 పరుగులు జోడించాడు. టాప్ ఆర్డర్ అందించిన బలమైన పునాదిని కృణాల్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుగా మలిచాడు. బరోడా బ్యాటర్ల ధాటికి హైదరాబాద్ బౌలర్లు చేతులెత్తేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..