మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, వెంకటేష్‌లతో కూడిన "మెగా విక్టరీ సాంగ్" విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మాస్ మల్టీస్టారర్ పాట చిరంజీవి న్యూ ఇయర్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, సంక్రాంతి వాతావరణాన్ని పదిహేను రోజుల ముందుగానే తీసుకొచ్చింది. థియేటర్లలో భారీ స్పందన ఖాయమని అంచనా.
అనిల్ రావిపూడి ఓ మాయగాడు.. ప్యాన్ ఇండియన్ ట్రెండ్‌లోనూ పక్కా ఎమోషన్స్ మిక్స్ చేస్తూ.. అభిమానులకు ఏమేం కావాలో లెక్కలేసుకుని మరీ ఇస్తున్నాడు. ఇప్పుడూ ఇదే చేసారు. ఇటు చిరంజీవి.. అటు వెంకటేష్‌లతో మళ్లీ మ్యాజిక్ చేసారు. మెగా విక్టరీ సాంగ్ విడుదల చేసారు. మరి ఇదెలా ఉంది..? అంచనాలు అందుకుందా లేదా..? చూస్తున్నారుగా.. ఈ పాట చూస్తుంటే ఇటు చిరు, అటు వెంకీ అభిమానులకు 15 రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చినట్లుంది. అభిమానులను ఎప్పట్నుంచో ఊరిస్తున్న మాస్ మల్టీస్టారర్ సాంగ్ వచ్చేసింది. ఓ వైపు చిరు.. మరోవైపు వెంకీ కలిసి చిందేస్తుంటే.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదు ఫ్యాన్స్‌కు. ఓరోజు ముందే న్యూ ఇయర్ వచ్చేసింది వాళ్లకు. రీ ఎంట్రీలో ఓ సెంటిమెంట్ అలవాటు చేసుకున్నారు మెగాస్టార్. కొత్త ఏడాదికి ముందు తన పాటే డిజేలో మోగేలా.. ఖతర్నాక్ మాస్ సాంగ్స్‌ను దించుతున్నారు బాస్. 2016 డిసెంబర్ 31న ఖైదీ నెం 150లోని బాస్ ఈజ్ బ్యాక్ పాటతో వచ్చిన చిరు.. 2022 డిసెంబర్ 30న వాల్తేరు వీరయ్యతో పూనకాలు పుట్టించే పాటతో వచ్చి మ్యాజిక్ చేసారు. 2025 డిసెంబర్ 30న ఏంటి వెంకీ సంగతి అంటూ మరో మాస్ నెంబర్ దింపారు చిరంజీవి. ఈసారి ఆయనకు తోడుగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి, ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఇద్దరూ పబ్బులో అలా స్టెప్పులు వేస్తుంటే.. ఆ తర్వాత చెరుకు గడలు పట్టుకుని లుంగీ కట్టుకుని డాన్సులేస్తుంటే.. రేపు థియేటర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇప్పటికే వచ్చిన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు బాగా రీచ్ అయ్యాయి.. మెగా విక్టరీ సాంగ్ ఇన్‌స్టంట్‌గా ఎక్కేలా కనిపిస్తుంది. రిలీజ్‌లోపు చిరంజీవి ఇంట్రో సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఈసారి పండక్కి శంకరవరప్రసాద్ నుంచి టన్నుల్లో ఎంటర్‌టైన్మెంట్ వచ్చేలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??
Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

