క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?
క్రిస్మస్ సీజన్‌లో విడుదలైన తెలుగు చిన్న చిత్రాల బాక్సాఫీస్ పనితీరు ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్, శంబాలా, ఈషా, దండోరా వంటి సినిమాలు పోటీపడ్డాయి. వసూళ్లలో ఛాంపియన్ ముందంజలో ఉండగా, శంబాలా కలెక్షన్లు, ఈషా మార్కెటింగ్ ద్వారా లాభపడ్డాయి. కంటెంట్‌తో దండోరా ప్రశంసలు పొందింది. ఈ పండుగ సీజన్ విజేతలు, సురక్షితమైన చిత్రాలపై పూర్తి విశ్లేషణ.
సంక్రాంతికి ముందు తెలియకుండానే పెద్ద సీజన్‌గా మారిపోతుంది క్రిస్మస్. మొన్న కూడా ఒకేరోజు అరడజన్‌కు పైనే సినిమాలు వచ్చాయి. మరి అందులో విన్నర్ ఎవరు..? ఏ సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయి..? ఏది సేఫ్ జోన్‌లో ఉంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఏ సినిమా సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఏది డైలమాలో పడిపోయింది..? చూద్దాం పూర్తిగా ఈ స్టోరీలో..! ఈ ఏడాది క్రిస్మస్ బరిలో చిన్న సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నడిచింది. ఛాంపియన్, శంబాలా, ఈషా, దండోరా, పతంగ్ పోటీ పడగా ప్రేక్షకుల తీర్పు కూడా భిన్నంగానే ఉంది. కలెక్షన్స్ పరంగా ఒకరు, కంటెంట్‌తో మరొకరు.. మార్కెటింగ్ మాయాజాలంతో ఇంకొకరు సేఫ్ అయ్యారు. మొత్తంగా ఈ పండగ సీజన్ బాక్సాఫీస్ విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వసూళ్ల పరంగా ఛాంపియన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. డీసెంట్ టాక్‌తోనే 4 రోజుల్లో 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా హీరో రోషన్‌కు ఛాంపియన్ బాగా వర్కవుట్ అయింది. ఇక ఈషా విషయానికి వస్తే.. కంటెంట్ కంటే.. బన్నీ వాస్, వంశీ నందిపాటి చేసిన భారీ ప్రమోషన్లే దీన్ని సేఫ్ జోన్‌లో పడేసాయి. ఓపెనింగ్స్‌తోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈషా. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి మచ్ నీడెడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది శంబాలా. బలమైన కంటెంట్‌తో వచ్చిన దండోరా ప్రశంసల దగ్గరే ఆగిపోయింది. పతంగ్ యూత్‌కు పర్లేదనిపించగా.. మోహన్ లాల్ వృషభ ఫస్ట్ డే చాప చుట్టేసింది. మొత్తంగా క్రిస్మస్ సినిమాల్లో.. కమర్షియల్‌గా ఛాంపియన్.. కలెక్షన్ల పరంగా శంబాలా.. సేఫ్ ప్రాజెక్ట్‌గా ఈషా.. కంటెంట్ పరంగా దండోరా గెలిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్కార్ భూమికి ఎసరు పెట్టిన రెవెన్యూ అధికారులు
Silver Price Today: ఒక్క రోజులో రూ.21,500 తగ్గిన కేజీ వెండి ధర
ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

