కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్
న్యూ ఇయర్ 2026కి కొత్త చిత్రాలకు బదులు పాత బ్లాక్‌బస్టర్‌లే సందడి చేయనున్నాయి. 4K క్వాలిటీతో పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు మురారి, వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ వంటి క్లాసిక్ చిత్రాలు డిసెంబర్ 31, జనవరి 1న రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాల హడావిడి స్థానంలో, ఈసారి పాత చిత్రాల ట్రెండ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వనుంది.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.. చూస్తుంటే ఇక్కడ గోల్డ్ కాదు ఏకంగా డైమండ్ అనాలేమో..? అంతగా పాత సినిమాలే సందడి చేస్తున్నాయిప్పుడు. ఈ న్యూ ఇయర్ అంతా ఓల్డ్ మూవీస్ హంగామానే కనిపించబోతుంది. కొత్తగా ఉంటుందనేమో.. కొత్త ఏడాదిని పాత సినిమాలతో వెల్ కమ్ చెప్తున్నారు. మరి అలా పలకరించబోయే ఆ సినిమాలేంటో చూద్దామా..? సాధారణంగా న్యూ ఇయర్ అంటే కొత్త సినిమాల హడావిడి ఉంటుంది. కానీ ఈసారి ట్రెండ్ మారి.. 2026కి స్వాగతం పలకడానికి పాత సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వెండితెరపై మ్యాజిక్ చేసిన క్లాసిక్స్‌ను ఇప్పుడు 4K క్వాలిటీతో మళ్లీ థియేటర్లలోకి తెస్తున్నారు. 2025 డిసెంబర్ 31న పవన్ కళ్యాణ్ జల్సాతో పాటు మురారి మరోసారి విడుదల కాబోతుంది. జల్సా ఇప్పటికే ఓసారి రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు సాధించింది.. అలాగే మురారి కూడా గతేడాది రీ రిలీజ్ అయి అదిరిపోయే వసూళ్లు తీసుకొచ్చింది. మళ్లీ ఈ రెండు సినిమాలను న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి విడుదల చేస్తున్నారు. ఈ రెండింటితో పాటు కొత్త ఏడాదిని చిరునవ్వుతో ప్రారంభించాలని నువ్వు నాకు నచ్చావ్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పడానికి నువ్వు నాకు నచ్చావ్‌కు మించిన ఆప్షన్ మరొకటి లేదు. ఇది కేవలం సినిమా కాదు.. ఒక లాఫింగ్ థెరపీ. జనవరి 1న ఈ సినిమా వస్తుంది. ఇక వీటితో పాటు సైక్ సిద్ధార్థ్, గత వైభవం, సహకుటుంబానాం, 45 లాంటి కొత్త సినిమాలు కూడా జనవరి 1న విడుదల కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా
2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే
మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం
టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??
Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

