వీరు పాన్-ఆధార్ లింక్ చేయనక్కర్లేదా ??
పాన్-ఆధార్ లింక్‌కు డిసెంబర్ 31, 2025 చివరి గడువు. ఆ తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవు, దీనివల్ల ఇన్‌కమ్ టాక్స్, బ్యాంకింగ్ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, కొంతమందికి ఈ లింక్ నుండి మినహాయింపు ఉంది. NRIలు, 80 ఏళ్లు పైబడిన వారు, అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ నివాసితులు, భారత పౌరులు కాని వారికి ఇది తప్పనిసరి కాదు. గడువులోగా లింక్ చేయకపోతే భారీ జరిమానా ఉంటుంది.
పాన్- ఆధార్ కార్డు లింక్ చేసేందుకు ప్రభుత్వం డిసెంబర్ 31,2025 వరకు గడువు విధించింది. మరికొద్ది గంటల్లో ఈ గడువు ముగిసిపోతుంది. జనవరి 1, 2026 నుండి ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇక చెల్లవు..దాంతో ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటివాటిపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే పాన్-ఆధార్ కార్డు లింక్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన డెడ్‌లైన్ నుండి కొద్దిమందికి మినహాయింపు ఇచ్చింది. వారెవరో ఇప్పుడు చూద్దాం. అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాలలో నివసిస్తున్న వారికి పాన్-ఆధార్ లింక్ నుండి మినహాయింపు ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం NRIలకు కూడా పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదు. ఎనభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారత పౌరులు కాని వారికి కూడా పాన్- ఆధార్ లింక్ ప్రాసెస్ నుండి మినహాయింపు ఉంటుంది. ఇక జాయింట్ అకౌంట్ హోల్టర్స్ పాన్-ఆధార్ లింక్స్ విషయానికి వస్తే… పాన్-ఆధార్ లింకింగ్ అనేది వ్యక్తిగత అవసరం. కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్స్,జాయింట్ డీమ్యాట్ అకౌంట్ లేదా జాయింటి ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో పాన్ కార్డు హోల్డర్స్ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. పాన్ కార్డు యూజర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే సదరు వ్యక్తి ట్రాన్సాక్షన్లపై కొన్ని పరిమితులు విధిస్తారు. పాన్ కార్డు పొందిన మైనర్లు విషయానికి వస్తే.. వారు పెద్దవారు అయ్యేంత వరకు దానిని ఆధార్‌తో లింక్ చేయవలసిన అవసరం లేదు. పాన్-ఆధార్ లింక్ నుండి మినహాయింపు పొందిన వారు తప్ప మిగతా వారు ఈ ప్రక్రియ చేయకపోతే, ఆ పాన్ కార్డును నిరుపయోగమైనదిగా పరిగణిస్తారు. ఆ పాన్ కార్డు యూజర్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ , బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి, షేర్స్ ,బాండ్స్ కొనుగోలు లాంటివి చేయలేరు. పాన్ కార్డు డియాక్టివేట్ చేయబడితే టీడీఎస్ డిడక్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 31 గడువు లోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే, ఆ పాన్ కార్డులను డిసెంబర్ 31 తర్వాత యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మాత్రమే పాన్ కార్డు మళ్లీ యాక్టివేట్ చేయబడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్ ట్రైన్‌లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
సల్మాన్ ఖాన్ సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అభ్యంతరం
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
రన్నింగ్ ట్రైన్‌లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

