హైదరాబాద్ సీపీ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదన్నారు. భారీ జరిమానాలు, వాహనాల జప్తు, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్పైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.