Viral Video : గోవా వీధుల్లో సారా టెండూల్కర్..చేతిలో బీర్ సీసాతో హల్చల్..షాకింగ్ వీడియో వైరల్
Viral Video : 2026 నూతన సంవత్సర వేడుకల కోసం సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు, ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేల్కర్, తన కాబోయే వదిన సానియా చందోక్ వంటి సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.

Viral Video : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆమె ఒక వివాదస్పద కారణంతో చర్చకు దారితీశారు. కొత్త ఏడాది (2026) వేడుకల కోసం గోవా వెళ్లిన సారా.. చేతిలో బీర్ సీసా పట్టుకుని రోడ్డుపై నడుస్తున్న ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2026 నూతన సంవత్సర వేడుకల కోసం సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు, ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేల్కర్, తన కాబోయే వదిన సానియా చందోక్ వంటి సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో సారా ఎరుపు రంగు దుస్తుల్లో మెరుస్తూ కనిపించారు. అయితే, అందరి దృష్టి ఆమె చేతిలో ఉన్న బీర్ బాటిల్ పైనే పడింది. సారా అలా బహిరంగంగా మద్యం సీసాతో కనిపించడం సచిన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ మద్యం లేదా పొగాకు సంబంధిత బ్రాండ్లను ప్రమోట్ చేయనని ప్రమాణం చేసి, దాన్ని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఆయన కుమార్తె ఇలా గోవా వీధుల్లో బీర్ సీసాతో తిరగడంపై కొందరు ట్రోల్ చేస్తున్నారు. “తండ్రి ఎంతో క్రమశిక్షణగా ఉంటే, కుమార్తె ఇలా ఉందేంటి?” అని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం “ఆమెకు సొంత ఇష్టాయిష్టాలు ఉంటాయి, సెలవుల్లో ఎంజాయ్ చేసే హక్కు ఆమెకు ఉంది” అంటూ సారాకు మద్దతుగా నిలుస్తున్నారు.
Sara Tendulkar Spotted With 𝗕𝗲𝗲𝗿 𝗕𝗼𝘁𝘁𝗹𝗲 At Arrosim Beach, Goa 😲 pic.twitter.com/cHSeqI1SzO
— Jara (@JARA_Memer) December 31, 2025
సారా టెండూల్కర్ కేవలం స్టార్ కిడ్ మాత్రమే కాదు, ఆమె ఒక విద్యావంతురాలు కూడా. లండన్ నుంచి న్యూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సారా, ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెల్‌నెస్ స్టూడియోను కూడా స్థాపించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సారా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఆమె క్లీన్ ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
