Amla Benefits: ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే వెంటనే స్టార్ట్ చేస్తారు!
ఉసిరి ఆయుర్వేదంలో సూపర్‌ఫుడ్‌గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని విటమిన్ సి, ఫైబర్ జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఉసిరి మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అందిరికీ తెలుసు. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ దాని ప్రయోజనాలు ఖరీదైన సూపర్‌ఫుడ్స్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. అందుకే ఆయుర్వేదంలో దీనిని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు వాటి ప్రయోనాలను మరింత ఎక్కువగా పొందవచ్చు. ఉదాహరణకు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి తినడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది, శరీరం మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ రోజు, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరం వ్యాధుల భారీన పడకుండా రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వాతావరణం మారినప్పుడు సులభంగా అనారోగ్యానికి గురయ్యే లేదా జలుబు, ఫ్లూ బారిన పడే వారికి, ఆమ్లా ఒక దివ్యౌషధం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మీరు గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే, ఉసిరి మీకు చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కడుపు ఆరోగ్యాన్ని మెరుపర్చడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. మీకు ఆ సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని లోపలి నుండి బలపరుస్తుంది.
వాపు, నొప్పిని తగ్గిస్తుంది: ఉసిరి శోథ నిరోధక లక్షణాలు వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా, దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని బలహీనపరిచే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
జుట్టు పెరుగుదల: ఉసిరి చర్మం, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని విటమిన్ సి కంటెంట్ కొల్లాజెన్‌ను పెంచడానికి, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రించడం: ఉసిరిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉసిరి ఎవరు తినకూడదు?
ఉసిరి వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది దీనిని తినకూడదు. అధిక ఆమ్లత్వం, తక్కువ రక్తపోటు, తక్కువ రక్తంలో చక్కెర లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు అస్సలు ఉసిరి జోలికి వెళ్లకూడదు. అలాగే, చాలా పొడి చర్మం లేదా జుట్టు ఉన్నవారు లేదా డీహైడ్రేషన్‌తో బాధపడేవారు ఉసిరితో జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
