భోగాపురం ఎయిర్పోర్ట్కు జనవరి 4న తొలి కమర్షియల్ టెస్ట్ ఫ్లైట్ రానుంది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు ల్యాండ్ అవుతుంది. కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీఏ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీని ద్వారా ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుంది.