Avatar 3 Villian: ఏంటీ.. అవతార్ 3లో విలన్.. ఆ స్టార్ హీరో మనవరాలా.. ? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే..
అవతార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో మూవీ సైతం అడియన్స్ ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా అవతార్ మూవీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హాలీవుడ్ సినిమా అయినప్పటికీ ఇండియాలోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మూడో మూవీ అవతార్ 3 జనాల ముందుకు వచ్చేసింది. పది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా భారత్ లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై మాత్రం విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ మూవీకి అటు పాజిటివ్.. ఇటు నెగిటివ్ రెండు కామెంట్స్ వచ్చేయి. అలాగే మరోవైపు వరల్డ్ వైడ్ మాత్రం కలెక్షన్స్ ఎక్కువగానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందులో విలన్ పాత్రలో నటించిన నటి గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అవతార్ 3లో ఫైర్ అండ్ యాష్ జాతికి లీడర్ గా వరంగ్ అనే పాత్రలో నటించింది ఊనా చాప్లిన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. అయితే ఊనా చాప్లిన్ మరెవరో కాదు.. దిగ్గజ కమెడియన్ చార్లిన్ చాంపియన్ మనవరాలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్ కూతురు ఊనా చాప్లిన్. తన తాత , అమ్మ బాటలోనే ఊనా సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
20 ఏళ్లకే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ చేసిన ఊనా.. ఆ తర్వాత హాలీవుడ్ లో టీవీ షోస్, షార్ట్స్ ఫిల్మ్స్ చేసింది. నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఊనా.. ఇప్పుడు అవతార్ 3 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
