Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఇటీవల యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ రానూ బొంబాయికి రాను. ఈ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్లి బరాత్, బర్త్ డే పార్టీస్, ఫ్రెండ్స్ పార్టీస్ ఇలా ఏ ఈవెంట్ జరిగినా ఇదే పాట మారుమోగుతుంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

“రానూ బొంబాయికి రాను..” ఇటీవల యూట్యూబ్ ను షేక్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫోక్ సాంగ్స్ కంటే.. ఈ పాట ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రతి వేడుకలో ఈ సాంగ్ మారుమోగింది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు.. ఇందులో రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు సైతం బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో వారిద్దరూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అయితే ఈ పాటతో అందరి దృష్టిని ఆకర్షించింది డ్యాన్సర్ లిఖిత. అందం, కట్టుబొట్టుతోపాటు.. మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లిఖిత.. ఈ పాటకు వచ్చిన ఆదాయం, తన రెమ్యునరేషన్ పై ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
తన స్వస్థలం శ్రీకాకుళం అని కానీ తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని లిఖిత స్పష్టం చేసింది. ప్రస్తుతం వయస్సు 18 సంవత్సరాలు అని తెలిపింది. క్రేజీ డాన్స్ స్టూడియోస్ లో డాన్స్ రీల్స్ , యాక్టింగ్ రీల్స్ చేస్తూ తాను ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. రానూ బొంబాయికి రాను అనే పాటను కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశామని.. ఈ పాట కోసం చేసిన రీల్ కు ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిపింది. పాట మొత్తం కంప్లీట్ కావడానికి రెండు రోజులు పట్టిందని తెలిపింది. ఈ పాటకు రూ.1 కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే అని తెలిపింది. కానీ డ్యాన్సర్ రాము విల్లా కొన్నాడు, బెంజ్ కొన్నాడు అని వస్తున్న రూమర్స్ నిజం కాదని తెలిపింది.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
అలాగే తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. రెండు రోజులకు ఎంత మాట్లాడుకున్నామో అంతే తనకు ఇచ్చారని.. భారీగా లాభం వచ్చింది కదా అని తాము ఎక్కువ అడగలేదని.. ముందు ఎంత చెప్పారో అంతే తీసుకున్నామని.. తాను పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా మరింత అందంగా ఆలపించాడని తెలిపింది. ఈ పాటకు కళ్యాణ్ కీస్ సంగీతం అందించగా.. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతోనే ఈ పాటను తెరకెక్కించాడని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.




