AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Victory Mass Song: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.. డ్యాన్స్ ఇరగదీసిన చిరు, వెంకీ..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. షూటింగ్ మొదటి రోజు నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు డైరెక్టర్ అనిల్. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు.

Mega Victory Mass Song: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.. డ్యాన్స్ ఇరగదీసిన చిరు, వెంకీ..
Mega Victory Mass Song
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2025 | 5:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం ఇది. వెంకీ, చిరు ఇద్దరు కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ కల నిజం కాబోతుంది. చిరు నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇదివరకు విడుదలైన మీసాల పిల్ల సాంగ్ సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క పాటతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్ అనిల్. ఇప్పుడు ఈ సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

చిరు, వెంకీ కాంబోలో రూపొందించిన మాస్ సాంగ్ ఇది. తాజాగా విడుదలైన ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ పబ్ సెట్టింగ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మాస్ స్టెప్పులు అదరగొట్టారు. ఇద్దరూ కలిసి ఫుల్ ఎనర్జిటిక్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ స్క్రీన్ షేక్ చేశారు. అలాగే తమ అభిమానులను విజువల్ ట్రీట్ అందించారు. మొదటిసారి బాసు, వెంకీ కలిసి కనిపించడంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ సాగే పదాలు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. అలాగే చిరు, వెంకీ స్టెప్పులు, మ్యూజిక్, లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో చిరు జోడిగా నయనతార నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే