Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో ట్రెండ్ మారింది. హీరోలతోపాటు విలన్స్ సైతం రూటు మార్చారు. ఒకప్పుడు విలన్ అంటే గుబురు గడ్డం, పెద్ద బొట్టు, మెడలో కండువా, పైజామాతో భయంకరంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం హీరోలకు ధీటుగా స్టైలీష్ లుక్స్, యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఓ విలన్ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలామంది విలన్స్ సైతం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. హీరో కటౌట్ ఉన్నప్పటికీ విలన్ పాత్రలు పోషించేందుకు రెడీ అంటున్నారు. ఎందుకంటే అటు హీరోలకు రానీ ఇమేజ్ సైతం విలన్ పాత్రలకు రావడం విశేషం. అలాగే ఒకప్పుడు హీరోలుగా మెప్పించినవారే.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తున్నారు. సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హాష్మీ ఇప్పటికే విలన్ పాత్రలతో సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవలే ధురందర్ సినిమాతో అక్షయ్ ఖన్నా సైతం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే తెలుగులోనూ స్టైలీష్ విలన్స్ ఉన్నారు. అందులో వినయ్ రాయ్ ఒకరు. గుర్తున్నాడా.. ? ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు .
హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నాడు. 2007లో వచ్చిన నీవల్లే నీవల్లే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వినయ్ రాయ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అతడికి తెలుగు, తమిళంలో మంచి పాపులారిటీ వచ్చింది.ఆ తర్వాత వాన సినిమాతో మరో హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ మాత్రం రాలేదు. తెలుగులో ఆఫర్స్ రాకపోయినా.. తమిళంలో మాత్రం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే హీరోగా కాకుండా నెమ్మదిగా విలన్ పాత్రలు సైతం పోషించాడు.
వరుణ్ డాక్టర్ అనే సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్న వినయ్ రాయ్ ప్రియురాలు సైతం తెలుగులో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా..? ఆమె మరెవరో కాదు.. విమలా రామన్. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోస్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటున్నారు. విమలా రామన్ తెలుగులో అనేక సినిమాల్లో నటించింది.
ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగ ది దొంగ, చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది. అలాగే కథనాయికగా నటించడంతోపాటు స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది. నువ్వా నేనా అనే చిత్రంలో గ్లామర్ సాంగ్ చేసింది. కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకున్న ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల రుద్రాంగి, గాండీవ దారి అర్జున చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది.
ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..
