AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: భర్త, చెల్లి మిస్సింగ్.. చూపు కోల్పోయిన హీరోయిన్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ప్రస్తుతం ఓటీటీల్లో విభిన్న కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఆధ్యంతం ఊహించని ట్విస్టులతో సాగే సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే సస్పెన్స్ జానర్ సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం ఓటీటీ మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులతో సాగుతుంది ఈ మూవీ.

Cinema: భర్త, చెల్లి మిస్సింగ్.. చూపు కోల్పోయిన హీరోయిన్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
Divya Drishti Movie
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2025 | 9:09 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఒరిజినల్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకుంటుంది. ఇందులో వచ్చే ట్విస్టులు, మిస్టరీ ఎలిమెంట్స్, సీన్స్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మొదటి నుంచి చివరి వరకు ప్రతిక్షణం మలుపు తిప్పే ట్విస్టులు, మరింత క్యూరియాసిటీని కలిగిస్తుంది. ప్రతి సీన్ మిమ్మల్ని చివరి వరుక సీట్ కు కట్టిపడేస్తాయి. ఆద్యంతం కొత్తగా, ఆసక్తికరంగా సాగుతుంది ఈ సినిమా.

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు దివ్య దృష్టి. ఇందులో సునీల్, ఈషా చావ్లా, కమల్ కామరాజు కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో ఈషా చావ్లా ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరోసారి ఈ మూవీలో సునీల్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో దివ్య, భవ్య అనే ట్విన్ సిస్టర్స్ ఉంటారు. వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువైతే చూపు కోల్పోతారు. అనుహ్యంగా చూపు కోల్పోయిన భవ్య.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అదే సమయంలో దివ్య భర్త సైతం కనిపించకుండపోతాడు. కొన్ని రోజులకు అతడు కూడా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత భవ్య జీవితంలోకి వచ్చిన కేర్ టేకర్.. ఆమెకు చూపు వచ్చేలా చేస్తాడు. కానీ ఆ తర్వాత అతడిపై భవ్యకు అనుమానం కలుగుతుంది. దివ్య తన చెల్లి, భర్త మరణాలకు కారణం ఆ కేర్ టేకర్ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత దివ్య ఏం చేసింది.. ?ఎలా తప్పించుకుంది? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండికితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!