AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

మీరు బహుశా సిల్క్ స్మిత గురించి వినే ఉంటారు. కానీ మీకు తెలుసా..అంతకు ముందే గ్లామరస్ పాటలతో సినిమా రంగుల ప్రపంచాన్ని శాసించిన ఓ హీరోయిన్ గురించి.. ఆమె తన డ్యాన్స్, యాక్టింగ్ తో సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆ నటి పేరు జ్యోతిలక్ష్మి. ఈ పేరు చెబితే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ మాముల్ది కాదు..

1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..
Jyothi Lakshmi
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2025 | 10:15 AM

Share

ప్రస్తుతం సినీరంగంలో స్పెషల్ పాటలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ సైతం ఈ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో గ్లామరస్ పాటలతో చక్రం తిప్పిన తారలు వేరు. హీరోయిన్లు కాకుండా పలువురు నటీమణులు స్పెషల్ పాటలతో అలరించారు. సిల్క్ స్మిత కంటే ముందే గ్లామర్ పాటలతో సినిమా ప్రపంచాన్ని శాసించిన నటి గురించి మీకు తెలుసా.. ? కొన్ని దశాబ్దాల పాటు తమ డ్యాన్సులతో కుర్రకారును ఊర్రూతలూగించారు. అందులో జ్యోతిలక్ష్మీ ఒకరు. జయమాలిని, సిల్క్ స్మిత కంటే ముందే సినీరంగాన్ని శాసించిన ఏకైక గ్లామరస్ క్వీన్ ఆమె. దాదాపు 1000కి పైగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్.. 300 సినిమాల్లో పలు పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

జ్యోతిలక్ష్మీ.. 1948 నవంబర్ 2న తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించిన ఆమెను.. తన మేనత్త తమిళ నటి ఎస్.పి.ఎల్ ధనలక్ష్మి చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఐదేళ్ల వయసులోనే ఓ సినిమాలో నాట్యం చేసింది జ్యోతిలక్ష్మీ. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులో శివాజీ గణేశన్ నటించిన కార్తవరాయన్ కథ మూవీలో స్పెషల్ డ్యాన్స్ చేసింది. 1963లో విడుదలైన పెరియ ఇడత్తు పెణ్ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన జ్యోతిలక్ష్మీ.. అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. 1967లో పెద్దక్కయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. 1973లో శోభన్ బాబు నటించిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అనే పాటతో అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 1000కి పైగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత 300 లకుపైగా సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఒకప్పుడు గ్లామరస్ పాటలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వాసుదేవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ అతడికి అంతకు ముందే వివాహం అయ్యింది. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకపోవడం వల్ల వీళ్ల పెళ్లిని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. వీరికి మీనాక్షి అనే పాప జన్మించింది. ఆ తర్వాత తన భర్త నుంచి విడిపోయి సినిమాటోగ్రాఫర్ సాయి ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు.డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన జ్యోతిలక్ష్మీ.. చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు 2016 ఆగస్ట్ 9న తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..పంత్‎కు ఆయన వార్నింగ్
పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..పంత్‎కు ఆయన వార్నింగ్
భారతదేశానికి షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు వార్నింగ్
భారతదేశానికి షాబాజ్ షరీఫ్ సన్నిహితుడు వార్నింగ్
ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..?
ఏడాది పొడవునా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..?
పండుగల వేళ రైల్వే శాఖ నుంచి మరో శుభవార్త.. ప్రయాణికులకు భారీ ఊరట
పండుగల వేళ రైల్వే శాఖ నుంచి మరో శుభవార్త.. ప్రయాణికులకు భారీ ఊరట
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
తగ్గేదేలే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. కానీ పట్టుబడ్డారంటే
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. కానీ పట్టుబడ్డారంటే
బడి పిల్లల ప్రాణాలనే పణ్ణంగా పెట్టిన బస్సు డ్రైవర్!
బడి పిల్లల ప్రాణాలనే పణ్ణంగా పెట్టిన బస్సు డ్రైవర్!