Akhanda 2: ‘అఖండ 2’ విలన్ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమాలో ఎంతో మంది స్టార్లు మెరిశారు. అందులో బెంగాళీ ప్రముఖ నటుడు శ్వాస్థ ఛటర్జీ కూడా ఒకరు. చైనా ఎక్స్ జనరల్ ఛాంగ్ పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టేశారీ సీనియర్ యాక్టర్.

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 తాండవం. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండ కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులు, విశేషాలతో అఖండ 2ను అద్భుతంగా తెరకెక్కించారు. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సనాతన ధర్మం, హిందూత్వం వంటి అంశాలను ఈ మూవీలో బాగా చూపించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఖండ 2 సినిమాలో భారీ తారగణమే ఉంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా మెప్పించింది. వీరితో పాటు అచ్యుత్ కుమార్, విజయ్ చంద్రశేఖర్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప, రాన్సన్ విన్సెంట్, కబీర్ దుల్హన్ సింగ్.. ఇలా చాలా మంది నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించారు. కాగా ఈ సినిమాలో విలన్లు కూడా చాలా మందే ఉన్నారు. అందులో తాండ్రికుడైన నేత్ర పాత్రలో ఆది పినిశెట్టి ఆడియెన్స్ ను భయపెట్టాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంగే షెల్ట్రిమ్ నటించాడు. చైనా మిలిటరీ అధినేత గా అతని అభినయం సిఇనమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఇతనికి సహాయపడే ఛాంగ్ పాత్రలో బెంగాళీ ప్రముఖ నటుడు శ్వాస్థ ఛటర్జీ కూడా తనదైన నటనతో మెప్పించారు. గతంలో కల్కి సినిమాలోనూ విలన్ గా నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు అఖండ 2 తో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు.
తండ్రి సుబేందు లానే సినిమాల్లోకి అడుగు పెట్టారు శ్వాస్థ ఛటర్జీ. పలు బెంగాళీ సినిమాల్లో నటించిన ఆయనకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్యన హిందీ, తెలుగు సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తున్నారీ సీనియర్ యాక్టర్. అన్నట్లు శ్వాస్థ ఛటర్జీ కూతురు హియా ఛటర్జీ బాగా ఫేమస్. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
భార్య, కూతురితో అఖండ 2 విలన్..
View this post on Instagram
ఇక తాత, తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ హియా ఛటర్జీ కూడా త్వరలోనే సినిమాల్లోకి రాబోతుంది. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటోందీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




