OTT Movie: ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేసిన సిరీస్ ఇదే.. తెలుగులోనూ రియల్ క్రైమ్ స్టోరీ
1982లో దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన ఓ సంఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కించుకున్న ఈ సిరీస్ 2025 ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో బెస్ట్ సిరీస్ గా నిలిచింది.

మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరానికి ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త సంవత్సరానికి సాదరంగా స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. సినిమాల పరంగా చూసుకుంటే.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. 2025లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. మూవీ లవర్స్ కు మంచి థ్రిల్ అందించాయి. అలా 2025లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో ఇది కూడా ఒకటి. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. తెలుగులోనూ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, అబ్బురపరిచే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ కు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కింది. అలాగే 2025 ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో బెస్ట్ సిరీస్ గానూ నిలిచింది. ఈ సిరీస్ విషయానికి వస్తే..ఇదొక రియల్ స్టోరీ. 1982లో ఢిల్లీని కుదిపేసిన తిహార్ జైలు ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
1978లో ఆగస్టులో కుల్జిత్ సింగ్, జస్బీర్ సింగ్ అనే అన్నదమ్ములు ఒక నేవీ అధికారి పిల్లలైన గీతా చోప్రా, సంజయ్ చోప్రాలను అపహరిస్తారు. వారిని అడవిలోకి తీసుకెళ్లి గీతపై అత్యాచారం చేసి అనంతరం ఇద్దరిని దారుణంగా హతమారుస్తారు. రెండు రోజుల తర్వాత ఓ పశువుల కాపరికి ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపిస్తాయి. ఇదే క్రమంలో నిందితులు రైలులో ప్రయాణిస్తుండగా అదే కోచ్ లో ఎక్కిన ఒక ఆర్మీ అధికారి వీరిని గుర్తుపట్టి, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విచారణలో వీరికి ఉరిశిక్ష ఖరారవుతుంది. 1982 జనవరి 31న ఢిల్లీలోని తిహార్ జైలులో ఈ అన్నదమ్ములను ఉరి తీశారు. అయితే ఉరి తీయగానే కుల్జిత్ సింగ్ చనిపోయినప్పటికీ, జస్బీర్ సింగ్ మాత్రం 2 గంటల పాటు ప్రాణాలతో ఉన్నాడట. అప్పట్లో ఉరి తీసేటప్పుడు బాడీ వెయిట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని తిహార్ జైలు మాజీ అధికారి సునీల్ గుప్తా, జర్నలిస్ట్ సునీత చౌదరి తమ ‘బ్లాక్ వారెంట్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఈ పుస్తకం ఆధారంగానే ఈ బ్లాక్ వారెంట్ సిరీస్ తెరకెక్కింది.
ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది
#BlackWarrantOnNetflix is one of the best cop dramas to be ever made with fantastic actors, beautiful & layered performances and an even better screenplay.@itsRahulBhat @CastingChhabra #ZahanKapoor #SidhantGupta pic.twitter.com/QqsMvwGuAh
— SB (@27sambhav) September 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




