Baahubali: The Epic OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్’ థియేటర్లలో రీ రిలీజైంది. కొత్త సినిమాలకు మించి రికార్డు కలెక్షన్లు సాధించింది. రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ‘బాహుబలి’. రాజమౌళి మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజైన ఈ మూవీ మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ.9.25 కోట్లు వసూలుచేసింది. ఓవరాల్ గా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ రికార్డుల కెక్కింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనుంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా గురువారం (డిసెంబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే బాహుబలి ది ఎపిక్ మూవీ ఓటీటీలోకి రానుందన్నమాట.
కాగా బాహుబలి రెండు భాగాల్లో సుమారు 90 నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించి థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. శివుడు- అవంతిక లవ్‌స్టోరీ, పచ్చ బొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను థియేటర్ వెర్షన్ లో తొలగించారు. అయితే ఇప్పుడు వీటిని ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా బాహుబలి ది ఎపిక్ థియేటర్ వెర్షన్ సుమారు 3 గంటల 40 నిమిషాల నిడివి ఉండనుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజువల్స్, సౌండ్ క్వాలిటీతో ఈ సినిమాకు మెరుగులు దిద్దారు. అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్, సరికొత్త కలర్ గ్రేడింగ్‌తో బాహుబలి ది ఎపిక్ ను రూపొందించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.
ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#Bahubali : The Epic will be streaming from Tonight on Netflix 🍿!!
Duration : 3hours 43 minutes 53 Seconds
Quality: 4K Dolby 5.1 Audio #OTT_Trackers pic.twitter.com/8adPyN6esh
— OTT Trackers (@OTT_Trackers) December 24, 2025
TONIGHT STREAMING – 25th December..
🌟 #AndhraKingTaluka – #Netflix 🌟 #BaahubaliTheEpic – #JioHotstar
Hindi Dubbed. pic.twitter.com/iFqJO5hsXw
— South HD Updates (@SouthHDUpdates) December 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




