OTT Movie: వామ్మో.. ఇలాంటి సైకోలు కూడా ఉంటారా? ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అదరగొడుతోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ సరికొత్త కథా కథనాలు, ఊహించని ట్విస్టులతో ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి మంచి రేటింగ్ దక్కడం విశేషం.

థియేటర్లయినా, ఓటీటీ అయినా ప్రజెంట్ మూవీ ట్రెండ్ ఏదంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను డబ్బింగ్ చేసి ఆయా భాషల్లో రిలీజ్ చేస్తుంటారు. మరికొన్ని ఓటీటీలో ఓరిజినల్స్ అంటూ సొంతంగా సినిమాలు, సిరీస్ లను రిలీజ్ చేస్తున్నాయి. అలా ఇటీవల డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. అదిరిపోయే ట్విస్ట్ తో డిజిటల్ ఆడియన్స్ ను మంచి థ్రిల్ అందజేస్తోంది. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది. దివ్య, భవ్య ట్విన్ సిస్టర్స్. వీరికి ఒక వ్యాధి ఉంటుంది. అదేంటంటే.. ఎక్కువగా స్ట్రెస్ కు గురైతే కంటి చూపు పోతుంది. అలా భవ్యకు చూపు పోతుంది. దీంతో ఆమె ఇంట్లో సూసైడ్ చేసుకుంటుంది. అయితే సోదరి చావు వెనుకాల ఏదో మిస్టరీ ఉందని దివ్యకు అనుమానం వస్తుంది. ఇది జరుగుతండగానే దివ్య భర్త సందీప్ కనిపించకుండా పోతాడు. అతను కూడా సూసైడ్ చేసుకోవడం చూసి దివ్యకు కూడా కంటి చూపు పోతుంది.
ఈ క్రమంలో ఒక కేర్ టేకర్ దివ్యకు కంటి ఆపరేషన్ చేయిస్తాడు. మెల్లగా ఆమెకు దగ్గరవుతాడు. అయితే భవ్య, సందీప్ లను చంపింది తనను కాపాడిన వాడేనని దివ్య తెలుసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు భవ్య, సందీప్ లను హత్య చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? చివరకు దివ్య ఆ క్రిమినల్ ను ఏం చేసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేర దివ్య దృష్టి. సునీల్, ఈషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో సునీల్ క్రూరమైన విలన్ గా నటించడం విశేషం. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇషా చావ్లా ఇందులో డబుల్ రోల్ లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సన్ నెక్ట్స్ లో దివ్య దృష్టి సినిమా..
Prepare for twists, thrills, and everything in between. Don’t miss out!
Stream Divya Drushti now on SunNXT!#DivyaDrushti #SunNXTExclusive #DirectToSunNXT #SunNXT #ThrillerMovie pic.twitter.com/q5IQH4Mn3t
— SUN NXT (@sunnxt) December 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




