AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ

కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక గత శుక్రవారమే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ
Dominic and the Ladies' Purse Movie
Basha Shek
|

Updated on: Dec 21, 2025 | 11:30 AM

Share

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇక ప్రజెండ్ మూవీ ట్రెండ్ అయిన పలు థ్రిల్లర్ సినిమాలు కూడా ఓటీటీలో వచ్చేశాయి, అందులో ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కొన్ని నెలల క్రితమే థియేటర్లో విడుదలైంది. మలయాళం ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాట్టింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్ గా రూ.18 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. డొమినిక్ ఓ మాజీ పోలీస్ ఆఫీసర్. పోలీస్ గా రిటైరైన తర్వాత ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. విఘ్నేష్ డొమినిక్ కు అసిస్టెంట్ గా పనిస్తుంటాడు. ఈ క్రమంలోనే డొమినిక్ కు ఒక పర్స్ దొరుకుతుంది. అది కూడా లేడీస్ ది. ఆ పర్స్ ఎవరిదో ఇన్వెస్టిగేట్ చేస్తున్న నేపథ్యంలో ఒక యువతి మిస్సింగ్ కేసు బయట పడుతుంది. ఆమె పేరు పూజ అని తెలుస్తుంది.

మరి మిస్సైన పూజ ఎవరు? ఆ పర్స్ తో అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఏమయ్యాడు. అతనితో ఈ మిస్సింగ్ కు లింకు ఉందా? అసలు ఆమె ఎలా చనిపోయింది ? అనే విషయాలు తెలియాలంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించాడు. అలాగే గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజి వెంకటేష్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా