AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tasty Teja: బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు.. బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ ఎమోషనల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టేస్టీ తేజ. అంతకు ముందు యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేశాడు. తాజాగా ఓ టాక్ షో కు హాజరైన అతను తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Tasty Teja: బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు.. బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ ఎమోషనల్
Bigg Boss Fame Tasty Teja
Basha Shek
|

Updated on: Dec 20, 2025 | 8:45 AM

Share

బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు పాల్గొన్నాడు టేస్టీ తేజ. బిగ్‌బాస్ సీజన్ 7లో మెయిన్ కంటెస్టెంట్ గా 9 వారాలు హౌస్ లో ఉన్న తేజ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా 13 వారం వారకు హౌస్ లో ఉండి బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ కు వాడుకుంటున్నాడు తేజ. స్టార్ సెలబ్రిటీలతో ఫుడ్ వీడియోలు చేస్తూ మంచి గానే సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చాడు టేస్టీ తేజ. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నాడు.

చూడ్డానికి బొద్దుగా ఉండే టేస్టీ తేజ తన ఆకారం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వాపోయాడు. ‘నాకు అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేసేంత సీన్ లేదు. నాకు ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంది. నా బాడీ స్ట్రక్చర్, నా కలర్ దానికి కారణం కావొచ్చు. చదువుకునేటప్పుడు క్లాస్‌లో అమ్మాయిల మధ్యలో నడుస్తూ వెళ్తున్నప్పుడు వీడేంటీ ఇలా నడుస్తున్నాడు? వీడు ఇంత లావు ఉన్నాడు అనేవారు. 8 ఏళ్ల పాటు నేను ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు. అందుకే ఇంకా ఆ ఇన్‌ఫియారిటీ కాంప్లెక్స్‌ నాలో ఎక్కువైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు తేజ

ఇవి కూడా చదవండి

పెళ్లికి అలాంటి కండిషన్ పెట్టింది..

ఈషోలో భాగంగా వర్ష తేజను ఒక ప్రశ్న అడిగింది.. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు సిక్స్ ప్యాక్ చేయ్ తేజా అంటే ఏం చేస్తావని వర్ష అడగ్గా ఒక ఆసక్తికర విషయం చెప్పాడీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.. ‘ నాకు బిగ్‌బాస్ ప్రియాంక జైన్ ఆఫర్ ఇచ్చింది. నువ్వు సిక్స్ ప్యాక్ చేయ్.. మనోడిని వదిలేస్తానంటే నేను దండం పెట్టేశా. దీంతో లైవ్‌లోనే ప్రియాంకకు ఫోన్ చేయగా.. నిన్ను పెళ్లి చేసుకుంటా, శివని పర్మిషన్ అడిగేదేంటీ? వాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడని ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది’.. ప్రస్తుతం కిస్సిక్ టాక్ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ షో ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే రానుంది.

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..