AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఎవరు గెలిచినా కాసుల వర్షమే.. ఈసారి బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు ఇంకేం రానున్నాయంటే?

సాధారణంగానే బిగ్ బాస్ రియాలిటీ షోల విజేతలపై కాసుల వర్షం కురుస్తుంటుంది. అలాగే స్పాన్సర్ కంపెనీలు కార్లు, గోల్డ్ ఛైన్లు కూడా కానుకలుగా అందిస్తుంటాయి. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎలాంటి కానుకలు అందుకుంటున్నాడో ఓ లుక్కేద్దాం రండి

Bigg Boss Telugu 9: ఎవరు గెలిచినా కాసుల వర్షమే.. ఈసారి బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు ఇంకేం రానున్నాయంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Dec 19, 2025 | 9:44 PM

Share

గత మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు తది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ఎన్నో ట్విస్టులు, ఆసక్తికరమైన టాస్కులతో సాగిన ఈ షోకు మరో రెండు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం 9 (డిసెంబర్ 21) జరగనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి బిగ్ బాస్ టైటిల్ కోసం ఐదుగురు పోటీ పడనున్నారు. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్‌గా పిలవబడే పవన్, సంజన గల్రానీ, తనుజ వీరిలో ఎవరు ఒకరు ఈసారి విజేతగా నిలవనున్నారు. పేరుకు ఐదుగురు ఉన్నా టైటిల్ రేసు తనూజ, కల్యాణ్ ల మధ్యనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోనున్నారు. కాగా ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ నూ కాసుల వర్షం కురవనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రైజ్ మనీ గురించి ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఒక ప్రకటన ఇచ్చారు. ఈసారి కూడా విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రోజులకు అనుగుణంగా కంటెస్టెంట్స్‌కు రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అంటే విన్నర్‌కు ఈ రెండు కలిపి భారీ మొత్తమే అందుతుందన్నమాట.

బిగ్ బాస్ విజేతలకు ప్రైజ్ మనీ, రెమ్యునరేషన్ తో పాటు స్పాన్సర్స్ కంపెనీల నుంచి అదనపు బహుమతులు కూడా వస్తాయి. కారు, ప్లాట్, బంగారు ఆభరణాలు లాంటి వాటిని కానుకలుగా ఇస్తారు. గత సీజన్ల విజేతలకు కూడా ఇలాంటి స్పాన్సర్స్ బహమతులు భారీగా అందాయి. కాబట్టి బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలిచానా వారిపై మాత్రం కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలేక సంబంధించి కంటెస్టెంట్లకు ఒక బంపరాఫర్ కూడా ఉంటుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు బిగ్ బాస్ టైటిల్ వదులుకుని బయటకు వెళ్లే కంటెస్టెంట్స్కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఇది కొన్ని సార్లు రూ.40 లక్షల వరకూ ఉంటుంది. అయితే కొందరు ఈ ఆఫర్‌ను తీసుకుంటారు, మరికొందరు బిగ్ బాస్ టైటిల్ కోసమే పోరాడతారు.

బిగ్ బాస్  లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.