Muskaan: ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు’.. జార్జిరెడ్డి హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. ఒకటి లేదా రెండు ఫ్లాప్ లు పడితే చాలు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతుంటారు. ఇక పెళ్లయ్యాక చాలా మంది హీరోయిన్లు యాక్టింగ్ కు కామా లేదా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. తమ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తుంటారు. ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా అదే చేస్తోంది.

2019లో తెలుగులో రిలీజైన సినిమా జార్జిరెడ్డి. ఓయూ విద్యార్థి నేత జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో బాగానే ఆడింది. నిర్మాతలకు మంచి పైసలు కూడా తెచ్చింది. జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో జార్జి రెడ్డి పాత్రలో అద్బుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు హీరో సందీప్ మాదవ్. ఇక జార్జిరెడ్డి జీవితంలో ఈ పాత్ర ఉందో లేదో తెలియదు కానీ.. మూవీలో ముస్కాన్ అనే అమ్మాయి అతనిని బాగా ఇష్టపడుతుంది. అలా జార్జి రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి పేరు ముస్కాన్ ఖుబ్‌చాంది. ఈ మూవీలో ఆమె డబుల్ రోల్ లో నటించడం విశేషం. సినిమాలో ఆమె నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అనే సాంగ్ తో బాగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఈ పాటలో ముస్కాన్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. జార్జి రెడ్డి సినిమా కూడా విజయం సాధించడంతో ముస్కాన్ కు కూడా సినిమా అవకాశాలు బాగా వస్తాయనుకున్నారు చాలా మంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. జార్జి రెడ్డి మూవీ తర్వాత ముస్కాన్ తెలుగులో పెద్దగా కనిపించలేదీ అందాల తార.
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన శేఖర్ లో ఒక కీలక పాత్ర పోషించిందీ ముస్కాన్. లక్ష్మీ, 420 ఐపీసీ మూవీస్ లోనూ కనిపించింది. అయితే ఈ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో క్రమంగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ నుంచి అదృశ్యమైపోయింది. ముస్కాన్ కు నటనతో పాటు జిమ్నాస్టిక్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే కథక్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. లాక్మే, లేయార్ వోట్టా గర్ల, కాఫీ బైట్ వంటి ఫేమస్ యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. బ్లాక్ బస్టర్ మూవీ వీర్ ది వెడ్డింగ్‌లో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
కాగా ముస్కాన్ జెన్ బుద్దీ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప ఉంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చైల్ట్ ఎడ్యుకేటర్‌గా పని చేస్తోంది. పిల్లల సంరక్షణ గురించి వీడియోలు చేస్తూ వాటిని ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.








