Jabardasth Mahidhar: ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరో తెలుసా?
జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్నమహిధర్ ప్రస్తుతం బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూలు ఇస్తున్నాడు. ఇతని రివ్యూలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ఈ జబర్దస్త్ కమెడియన్ పెళ్లిపీటలెక్కాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్, నటీనటులుగా, డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే బాగా పాపులర్ అయిన వారిలో మహిధర్ కూడా ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు. అయితే ఎందుకోగానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. సినిమా, బిగ్ బాస్ రివ్యూలు, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇతని వీడియోలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. వీటితో పాటు ఓ కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు మహీధర్. తాజాగా ఈ జబర్దస్త్ కమెడియన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయన్ని ప్రారంభించాడు. చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వైజాగ్ లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. మహీధర్ భార్య చంద్రకళ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మహిధర్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, జబర్దస్త నటులు మహిధర్- చంద్రకళకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా మహిధర్- చంద్రకళది ప్రేమ వివాహం. వీరు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉంటున్నారు. ఈ విషయాన్ని మహిధరే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ‘చంద్ర కళది రాజమండ్రి. వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేసింది. యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయింది. తను నా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్. తనే మొదట నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. నా వీడియోస్ చూసేది. నా వీడియోస్ బాగున్నాయి అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేది. ఆ తర్వాత పండగలకు, పుట్టిన రోజులకు మెసేజ్ లు చేసేది.నేను వైజాగ్ లోనే ఉండేవాన్ని. తను కూడా వైజాగ్ లోనే చదువుతుందని తెలిసి బయట కలిశాం. ఇద్దరి అభిరుచులు కలవడంతో మా పరిచయం ప్రేమగా మారింది. 2019 నుంచి మేం ప్రేమలో ఉన్నాం. మా పెళ్లికి ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నారు’ అని కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహిధర్. మొత్తానికి ఆరేళ్ల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకున్నాడీ జబర్దస్త్ కమెడియన్.
జబర్దస్త్ మహిధర్ పెళ్లి ఫొటోస్..
View this post on Instagram
భార్యతో జబర్దస్త్ మహిధర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




