Pawan Kalyan: అయ్యో.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రముఖ దర్శకుడి కుమారుడి మరణం.. పవన్ కల్యాణ్ సంతాపం
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడి కుమారుడు ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ దర్శకుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సహా పలువురు సినీ ప్రముఖులు సదరు దర్శకుడికి ధైర్యం చెబుతున్నారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాదగౌడ కుమారుడు ప్రమాదవశాత్తూ లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం (డిసెంబర్ 15) ఈ విషాదం జరిగింది. దీంతో దర్శకుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నారు. కీర్తన్ నాదగౌడ కన్నడలో అనేక సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసారు. పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన కేజీఎఫ్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ఈ అనుభవంతోనే త్వరలోనే డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకునేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇటీవలే కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హారర్ సినిమాని ప్రకటించి పూజ కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇంతలోనే కీర్తన్, సమృద్ధి దంపతుల కుమారుడు సోనార్ష్ కె.నాదగౌడ లిఫ్ట్ లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. . ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు.
‘దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది’. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను’ అని సంతాపం తెలిపారు పవన్ కల్యాణ్.
కుమారుడితో కీర్తన్, సమృద్ధి దంపతులు..
View this post on Instagram
పవన్ కల్యాణ్ ట్వీట్..
దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 15, 2025








