Tollywood: సోషల్ మీడియాలో ఫొటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోనున్న స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో ఇతనికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. అలాగే నటుడిగానూ తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో తరచూ ఆటు పోట్లు ఎదుర్కొంటున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్.

ఈ మధ్య కాలలో విడాకులు తీసుకునే వారు, బ్రేకప్ చెప్పుకునే వారు ఒక ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అదేంటంటే.. వీరు ముందుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరి కలిసున్న ఫోటోలు డిలీట్ చేసుకుంటారు. ఆపై కొన్ని రోజులకు విడాకులు, బ్రేకప్ అంటూ అసలు విషయం చెబుతారు. ఇప్పుడదే తరహాలో ఓ కోలీవుడ్ జంట కూడా విడిపోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ తమిళ సినిమా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఒక ప్రధాన కారణముంది. అదేంటంటే.. సెల్వ రాఘవన్ భార్య, ప్రముఖ దర్శకురాలు గీతాంజలి తన సోషల్ మీడియాలో భర్తతో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఉన్నట్లుండి సడెన్ గా ఫొటోలు తీసేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని రూమర్లు వినిపిస్తున్నాయి.
పేరుకు తమిళ దర్శకుడే అయినా సెల్వరాఘవన్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేశాడు సెల్వ. ఇందులో అతని తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఇక 7/G రెయిన్‌బో కాలనీ (7/G బృందావనం) తో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇందులో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సెల్వ రాఘవన్. 2006లో వీరి పెళ్లి జరిగింది. అయితే ఎక్కువ కాలం కలిసుండలేపోయారు.
2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది దర్శకురాలు గీతాంజలి ని రెండో పెళ్లి చేసుకున్నాడీ డైరెక్టర్. 14 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసున్న ఈ దంపతుల మధ్య ఇప్పుడు మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ కోలీవుడ్ లో వీరి విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ విడాకుల వార్తలు నిజమా? కదా? అన్న ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సెల్వ రాఘవన్ తమ్ముడు హీరో ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడం గమనార్హం!
కాగా యుగానికి ఒక్కడు, 7/G బృందావనం కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు సెల్వ రాఘవన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








