AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar Moive: స్టార్ హీరో సినిమాకు షాక్.. ధురంధర్ సినిమాపై నిషేధం.. కారణాలివే

బాలీవుడ్ స్టార్ హరో రణ్ వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సినిమా. 'ధురంధర్'. ఇటీవలే థియటేర్లలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అంచనాకలు మించి వసూళ్లు రాబడుతోంది. అయితే ఇంతలో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Dhurandhar Moive: స్టార్ హీరో సినిమాకు షాక్.. ధురంధర్ సినిమాపై నిషేధం.. కారణాలివే
Dhurandhar Movie
Basha Shek
|

Updated on: Dec 13, 2025 | 6:20 AM

Share

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్. యురి ఫేమ్ ఆదిథ్య ధార్ తెరకెక్కించిన సినిమాలో సారా అర్జున్ కథానాయికగా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితర స్టారాది స్టార్స్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ధురంధర్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.  బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతున్న మూవీ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సూపర్ హిట్ సినిమాపై నిషేధం విధించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు దేశాలు ఈ సినిమాను నిషేధించాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలు ఈ నిషేధాన్ని విధించాయి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ మూవీలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండడంతో ఇస్లామిక్ దేశాలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలో, ‘స్కై ఫోర్స్’, ‘ఫైటర్’, ‘ఆర్టికల్ 370’, ‘టైగర్ 3’ సినిమాలను కూడ ఈ దేశాలలో నిషేధించారు. అయితే ధురంధర్ చిత్ర బృందం తమకు ఆసమస్య రాకుండా శాయశక్తులా ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. సెన్సార్ బోర్డు ఈ సినిమా రిలీజ్ కు అంగీకరించలేదు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అప్పటి నుండి, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు, భారతదేశంలో రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఈ వారాంతంలో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా చాలా సంవత్సరాల తర్వాత సినిమాతో రణ్‌వీర్ సింగ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా అతని కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. వివాదాలు ఉన్నప్పటికీ, సినిమాకు భారీ కలెక్షన్లు సాధిస్తన్నాయి. అయితే ఇప్పుడు నిషేధం కూడా సినిమా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపదని తెలుస్తోంది.

ధురంధర్ సినిమాకు అల్లు అర్జున్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి