AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్.. ఇప్పుడు ఇక్కడ కూడా.. త్వరలోనే గ్రాండ్ ఓపెనింగ్

మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో మాత్రమే కాదు,మంచి బిజినెస్ మెన్ కూడా. మహేష్ బాబుకు AMB సినిమాస్ అనే మల్టీప్లెక్స్ మాల్ ఉంది. ఇప్పుడీ మల్టీ ప్లెక్స్ థియేటర్‌ బిజినెస్ ను మరింత విస్తరించే పనిలో బిజీగా ఉన్నాడు మహేష్.

Mahesh Babu: మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్.. ఇప్పుడు ఇక్కడ కూడా.. త్వరలోనే గ్రాండ్ ఓపెనింగ్
Mahesh Babu AMB Cinemas
Basha Shek
| Edited By: |

Updated on: Dec 12, 2025 | 12:51 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ పాన్-వరల్డ్ స్టార్ కూడా మారనున్నాడు. ఇందులో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ బాబు స్టార్ హీరోనే కాకుండా మంచి బిజినెస్ మెన్. ఏఎమ్ బీ మాల్ పేరుతో మల్టీ ప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు మహేష్.

మహేష్ బాబు యాజమాన్యంలోని AMB సినిమాస్ పేరిట ఇప్పటికే హైదరాబాద్‌తో సహా చాలా నగరాల్లో మల్టీ ప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. ఇవి ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తున్నాయి. AMB సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ లతో పాటు హోటల్, రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు తన AMB వ్యాపారాన్ని బెంగళూరుకు కూడా విస్తరించాడు. అంటే ఈ AMB సినిమాస్ బెంగళూరులో కూడా ప్రారంభం కానుంది. నగరంలో చారిత్రాత్మక సినిమా హాల్ ఉన్న ప్రదేశంలోనే మహేష్ బాబు తన కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు.

మహేష్ బాబు కొత్త సినిమా థియేటర్ కపాలి సినిమా స్థలంలో రాబోతోంది, ఇది ఆసియాలోనే అతిపెద్ద సినిమా థియేటర్. సినీరామ్ టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి సినిమా థియేటర్.ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రారంభం కానున్న సినిమా థియేటర్ కు ‘AMB సినిమాస్ కపాలి’ అని పేరు పెట్టారు. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవం డిసెంబర్ 16న జరుగనుందని సమాచారం. మహేష్ బాబు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్.

ఇవి కూడా చదవండి

AMB సినిమాస్‌లో 60 అడుగుల వెడల్పు మరియు 60 అడుగుల పొడవు గల తొమ్మిది స్క్రీన్‌లు ఉంటాయి. ప్రతి స్క్రీన్ ఒకేసారి 600 మంది ప్రేక్షకులకు వసతి కల్పిస్తుంది మరియు స్క్రీన్‌లు ఉత్తమ వీడియో నాణ్యతను కలిగి ఉంటాయి. యాంబియంట్ లైటింగ్‌తో పాటు, మీరు ఉత్తమ ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల, హైదరాబాద్‌లోని RTCX రోడ్డులో మరో మల్టీప్లెక్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..