Actress Poorna: మా అమ్మ కల నిజమైంది.. నటి పూర్ణ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?
గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూర్ణ. అలాగే చాలా సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పించింది. ఇక పెళ్లి, పిల్లలయ్యాక అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోందీ అందాల తార. తాజాగా పూర్ణ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. ఆ తర్వాత సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, లడ్డూ బాబు, నువ్వలా నేనిలా, అవును 2, జయమ్ము నిశ్చయమ్మురా, సిల్లీ ఫెలోస్, దసరా, తీస్ మార్ ఖాన్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది పూర్ణ. సినిమాల సంగతి పక్కన పెడితే.. మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వాత కుమారుడు పుట్టడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతపెట్టి పాటతో రీఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం పలు డ్యాన్స్, టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇదిలా ఉంటే పూర్ణ చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుందట. మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీల్లో పాల్గొని సత్తా కూడా చాటింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ అయిపోవడంతో మళ్లీ స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టేజీపై నృత్య ప్రదర్శన చేసిన పూర్ణ బాగా ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన భర్త గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది పూర్ణ.
‘మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను క్లాసికల్ డ్యాన్సర్ అయ్యాను. పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు.. అమ్మలా నా డ్యాన్స్‌ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని భగవంతుడిని కోరుకున్నాను. అలానే ‘నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి’ అని అమ్మ కూడా నన్ను దీవించింది. ఇప్పుడు దేవుడు అటుమా అమ్మ కలను, ఇటు నా కలను నిజం చేశాడు. నా భర్త.. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. అయినా సరే నా డ్యాన్స్‌కి బాగా సపోర్టుగా నిలుస్తున్నారు. కులం, మతం, నేపథ్యం లాంటి తేడాలు పట్టించుకోకుండా ఓ మనిషిగా, ప్రేమ గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని’ అని భర్తపై ప్రేమను కురిపించింది పూర్ణ. ప్రస్తుతం ఆమె క్లాసికల్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








