Janhvi Kapoor: అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఓటీటీ టాప్ ట్రెండింగ్ మూవీపై జాన్వీ ప్రశంసలు
ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జూనియర్ శ్రీదేవి ఓ తెలుగు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.

జయాపజయాలతో సంబంధం లేకుండా హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్. ఈ ఏడాది ఆమె నటించిన ‘హోమ్‌బౌండ్’, ‘పరమ్ సుందరి’, ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ‘హోమ్‌బౌండ్’ మూవీ ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఇక గతేడాది ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన జాన్వీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆడిపాడుతోంది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ మెగా మూవీలో జాన్వీ ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి రిలీజైన జాన్వీ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ జూనియర్ శ్రీదేవి లేటెస్ట్ గా ఓ తెలుగు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చి ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోన్న ఈ మూవీని అందరూ చూడాలని కోరింది. ఇంతకు ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఓటీటీలో విశేష స్పందన లభిస్తోంది. తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయింది. అనంతరం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో రంగులు పూసుకుని, మైక్ ముందు నిల్చుని, కళ్లపై పడుతున్న కాంతిని అడ్డుకుంటున్న రష్మిక ఫొటోను షేర్ చేసిన జాన్వీ.. ‘ది గర్ల్‌ఫ్రెండ్. మాండేటరీ వాచ్ (తప్పక చూడాల్సిన సినిమా)’ అని రాసుకొచ్చింది. దీనికి కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, చప్పట్ల ఎమోజీలను జత చేసింది.
ఇక జాన్వీ కపూర్ ప్రశంసలపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించాడు. “ఆమెది చాలా మంచి మనసు” అంటూ హార్ట్ ఎమోజీతో కృతజ్ఞతలు తెలిపాడు.
నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో రష్మిక సినిమా..
November 2025 – #TheGirlfriend
There were some good movies like Kaantha, Zootopia2 that I saw last month but The Girlfriend stood out for me.
The way it explored a toxic relationship and how a girl gets affected by it so effectively with pic.twitter.com/XhdPRqJOhP
— Celluloid Conversations (@CelluloidConve2) December 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








