AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ కోసం ఏకమైన ఆ ఇద్దరు స్టార్స్.. బొమ్మ దద్దరిల్లిపోద్ది

కన్నడ సూపర్ స్టార్ యష్ 'టాక్సిక్' విడుదలకు ఇంకా 100 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిత్ర బృందం ప్రమోషన్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు, ఈ పాన్ ఇండియా చిత్రం గురించి ఒక బిగ్ అప్ డేట్ వచ్చింది. అదేంటంటే..

Toxic Movie: యశ్ 'టాక్సిక్' కోసం ఏకమైన ఆ ఇద్దరు స్టార్స్.. బొమ్మ దద్దరిల్లిపోద్ది
Toxic Movie
Basha Shek
|

Updated on: Dec 09, 2025 | 8:36 AM

Share

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం, ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్స్ కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ‘టాక్సిక్’ సినిమా సంగీతం గురించి చాలా క్యూరియాసిటీ క్రియేట్ అయ్ఇయంది. ఈ పాన్ ఇండియా మూవీకి ఎవరు సంగీతం అందిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మొదట అనిరుధ్ యశ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారని చెప్పుకున్నారు. అయితే, తరువాత రవి బస్రూర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ఏమిటంటే, ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని చెబుతున్నారు.

రవి బస్రూర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కేజీఎఫ్ సినిమాలతో అతని పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా యశ్ తో రవి బస్రూర్ కు మంచి అనుబంధం ఉంది . మరోవైపు అనిరుధ్ క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. అతను ఇప్పుడు అనేక భారీ బడ్జెట్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రవి బస్రూర్ ‘టాక్సిక్’ చిత్రానికి BGM అందించనుండగా, అనిరుధ్ పాటలకు సంగీతం సమకూర్చనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరో 100 రోజుల్లో టాక్సిక్ సినిమా రిలీజ్..

‘టాక్సిక్’ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యష్, కియారా అద్వానీ, నయనతార తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం మార్చి 19న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ చిత్రానికి పనిచేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.