ఇరగదీసిన ఇమ్మాన్యుయేల్.. సెకండ్ ఫైనలిస్ట్ మనోడే అంటున్న ఫ్యాన్స్
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. అంటే మరో రెండు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ పడనుంది.

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. ఫైనల్ కు దగ్గరపడుతున్న క్రమంలో టైటిల్ రేస్ ముఖ్యంగా కల్యాణ్ తనుజ మధ్య జరుగుతోంది. ఇమ్మాన్యువెల్, సంజనా కూడా స్ట్రాంగ్ కాంటెండర్స్‌గా ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో క్యాప్టెన్ కల్యాణ్ కు ఇచ్చిన పవర్‌తో ఎవరైనా ఒక నామినేటెడ్ కొంటెస్టెంట్‌ను సేఫ్ చేసి, మరొకరిని డేంజర్ జోన్‌లోకి తీసుకురావచ్చు. ఈ ట్విస్ట్ వల్ల హౌస్‌లో అలయన్సెస్ షేక్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ కు బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్ అనే టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లోకి ఆరు బాక్సులు పంపించాడు బిగ్‌బాస్. ఇందులో 0 – 2,50,000 వరకూ నంబర్లు ఉన్నాయి. ఆ బాక్స్ ల్లో ఉన్న పాయింట్స్ ను ఒకొక్కరికి కేటాయించాలి అని చెప్పాడు బిగ్ బాస్.
కాగా ఇమ్మానుయేల్ 2,50,000, తనూజకి 2,00,000, డీమాన్‌కి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, భరణికి 50,000 ఇచ్చారు హౌస్ మేట్స్ ఇక చివరిగా మిగిలిన 0ని సంజనకి ఇచ్చారు. దాంతో సంజన కాసేపు వాదన పెట్టుకుంది. సంజనకు ఇమ్మాన్యుయేల్, డీమన్ సపోర్ట్ చేశారు కానీ మిగిలిన వారు ఆమెకు 0ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో నేను ఎంత ఆడినా కూడా నాకు ఇచ్చింది జీరో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. జీరో రావడంతో బిగ్ బాస్ సంజనను జైలుకు పంపాడు.
ఆతర్వాత ఈ వారం హౌస్ లో ఉన్న అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది.. అని బిగ్ బాస్ ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇప్పటి నుంచి మీరు యుద్దాలు చేయాల్సి ఉంటుంది. మీ ప్రదర్శనను బట్టే మీ స్కోర్ బోర్డు లెవల్ పెరుగుతుంది. తద్వారా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. ఈవారం టాప్ వన్ లో నిలిచిన వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అలాగే టాప్-2గా నిలిచే ఇద్దరు సభ్యులు ప్రేక్షకులను ఓట్ అపీల్ చేసుకొని వారి నిర్ణయంతో సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లీడర్ బోర్డు లో చివరిగా ఉన్న హౌస్ మెట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. దాంతో పాటు సంజన మొదటి ఛాలెంజ్ లో పాల్గొనే ఛాన్స్ లేదు అని చెప్పాడు బిగ్ బాస్. కాగా మొదటి యుద్ధం స్వింగ్ జరా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు కళ్యాణ్ సంచలక్ గా ఉన్నాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ అదరగొట్టాడు. అతనే విన్ అయ్యి మొదటి స్థానంలో నిలిచాడు. కాగా భరణి, డీమాన్, తనూజ చివరిగా సుమన్ శెట్టి నిలిచారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




