- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Sonarika and husband Vikas Parashar blessed with a baby girl
Tollywood: ఒకే ఒక్క సీరియల్‌తో నేషనల్ వైడ్ ఫేమస్.. తల్లైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్న ఓ ఫేమస్ సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇక ఏడాది ప్రారంభంలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందింది.
Updated on: Dec 07, 2025 | 4:51 PM

టాలీవుడ్ హీరోయిన్ శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. శుక్రవారం (డిసెంబర్ 05) తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈముద్దుగుమ్మకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

'దేవాన్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించిన సోనారిక.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులోనూ 'జాదుగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార.

ఆ తర్వాత 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోవడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు సోనారిక.

కాగా గతేడాది వ్యాపారవేత్త వికాస్ పరశార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది.

ఇప్పుడు డిసెంబరు 5న తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.




