- Telugu News Photo Gallery Cinema photos Do You Know About Actress Priyanka Mohan Net Worth and Life Assets
Priyanka Mohan : పవన్ కళ్యాణ్, నానితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ప్రియాంక మోహన్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ?
దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో ప్రియాంక మోహన్ ఒకరు. తెలుగు, తమిళంలో వరుసగా హిట్స్ అందుకుంటుంది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేస్తునన ఈ అమ్మడు పేరు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.
Updated on: Dec 07, 2025 | 6:49 PM

ప్రియాంక అరుళ్ మోహనన్.. ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో రాణిస్తున్న హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ప్రియాంక.. నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి అరుళ్ మోహన్ తమిళనాడులో వ్యాపారవేత్త.

ప్రియాంక 2019లో కన్నడ సినిమా సంకలనం ఓంధ్ కథే హెల్లాలో అధితి పాత్రలో నటించింది. అదే ఏడాది న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన ఆమె నటించిన తొలి తమిళ సినిమా డాక్టర్ (2021) ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. డాన్, ఈథర్క్కుం తునింధవన్, శ్రీకరం వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

నివేదికల ప్రకారం ప్రియాంక ఆస్తులు రూ.15 కోట్లకు పైగానే ఉంటున్నాయని సమాచారం. ఆమె మోడలింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

ప్రియాంక వద్ద ఆడి క్యూ 3, టయోటా, ఇన్నోవా క్రిస్టా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె ఫిట్నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. యోగా, వ్యాయమం, డైట్ విషయంలో చాలా నిబద్ధతగా ఉంటుంది. ప్రియాంక తెలుగు, కన్నడ, తమిళ భాషలు సులభంగా మాట్లాడుతుంది




