AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: లవర్‌ కోసం కన్నతండ్రినే చంపేసే కూతురు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

బంధాలు, డబ్బు, మానవ సంబంధాలు, విచక్షణ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆదివారం (డిసెంబర్ 07) నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వీకెండ్ లో మూవీ లవర్స్ కు ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie: లవర్‌ కోసం కన్నతండ్రినే చంపేసే కూతురు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Ghatana Movie In OTT
Basha Shek
|

Updated on: Dec 07, 2025 | 7:03 PM

Share

ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తుంటాయి. అలా ఆదివారం (డిసెంబర్ 07) కూడా కొత్త సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది కేవలం మూడు పాత్రల చుట్టూ సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. రిషికేష్వర్ యోగి సమర్పించిన సినిమాకు కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించారు. అలాగే, స్క్రీన్ ప్లే కూడా అందించారు. సినిమాలో రావణ్, చాందినీ కీలక పాత్రలు పోషించారు. సినిమా కథ మొత్తం వీరిద్దరి చుట్టే తిరుగుతుంది.  స్టోరీ విషయానికి వస్తే..  రావణ్, చాందిని బాగా అప్పుల్లో కూరుకుపోతారు. బ్యాంక్ వాళ్లు అప్పులు క్లియర్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పుల నుంచి బయటపడేందుకు రావణ్ ఒక ప్లాన్ వేస్తాడు. చాందిని తండ్రిని చంపేస్తే అతని నుంచి ఆస్తి వస్తుందని స్కెచ్ వేస్తాడు. విషయం తెలుసుకున్న చాందినీ ముందు వద్దని వారిస్తుంది. కానీ చివరకు ప్రియుడి మాటలకు తలొగ్గుతుంది. ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేందుకు ఒప్పుకుంటుంది. ప్లాన్ ప్రకారం కాఫీలో తండ్రికి విషం పెట్టి చంపుతుంది చాందిని. మరి ఆ తర్వాత ఏమైంది? రావణ్, చాందినీల ప్లాన్ సక్సెస్ అయ్యిందా? ప్రియుడికి తెలియకుండా చాందిని వేసిన ప్లాన్ ఏంటి? రావణ్ ఏమయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ కథా సుధా ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా ప్రతివారం ఒక సినిమా స్ట్రీమింగ్ కు వస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఆదివారం కూడా ఘటన అనే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. కలర్ ఫొటోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చాందీని రావు సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ఘటన సినిమాకు కథ, డైలాగ్స్‌ను అనుదీప్ పోటునుక రాశారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. కాగా ఈటీవీ విన్ కథా సుధాలో ఫోర్ టేల్స్‌లో భాగంగా ఘటన ఓటీటీ రిలీజ్ అయింది. నిజానికి ఈ ఘటన రెండు, మూడు వారాల ముందే స్ట్రీమింగ్ కు రావాల్సింది. అయితే ఎందుకో లేట్ అయ్యింది. ఎట్టకేలకు ఆదివారం నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఈటీవీ విన్ లో ఘటన సినిమా స్ట్రీమింగ్..

ఘటన సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..