AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaantha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా దుల్కర్ సల్మాన్ కాంత.. ఎప్పుడు ఎక్కడంటే..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత.సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది.

Kaantha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా దుల్కర్ సల్మాన్ కాంత.. ఎప్పుడు ఎక్కడంటే..
Kaantha
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2025 | 12:48 PM

Share

పేరుకు మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. ఒకే బంగారం సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది’. ఆతర్వాత డైరెక్ట్ గా తెలుగులో మహానటి సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమా దుల్కర్ ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆతర్వాత ఆయన నటించిన సీతారామం సినిమా. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయం అందుకున్నాడు.

ఇక రీసెంట్ గా కాంత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దుల్కర్. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ మూవీ కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓ వర్గం ఆడియెన్స్ కు కాంత సినిమా బాగా కనెక్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో దుల్కర్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ కాంతా సినిమాను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి