AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ముద్దుగుమ్మ మనసూ అందమైనదే.. క్యాన్సర్ బాధితుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో

ఆడవారి అందాన్ని పెంచడంలో కురులది కీలక పాత్ర. జుట్టు ఎంత ఒత్తుగా, పొడవుగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు అమ్మాయిలు. అయితే అలాంటి అందమైన కురులను క్యాన్సర్ బాధితుల కోసం దానం చేసింది ఓ టాలీవుడ్ హీరోయిన్. దీంతో ఈ ముద్దుగుమ్మ మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు.

Tollywood: ఈ ముద్దుగుమ్మ మనసూ అందమైనదే.. క్యాన్సర్ బాధితుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
Actress Abhinaya
Basha Shek
|

Updated on: Dec 08, 2025 | 6:01 PM

Share

అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, రక్తదానం, అవయవదానం.. ఇలా అన్ని దానాల గురించి మనం వింటే ఉన్నాం. అయితే కురుల దానం మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వింటాం. ఎందుకంటే దీని పట్ల ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. క్యాన్సర్‌ రోగులు జుట్టును ఎక్కువగా కోల్పోతుంటారు. చికిత్సలో భాగంగా రేడియేషన్‌, కీమోథెరపీల కారణంగా వారి జుట్టు బలహీనపడుతుంది. క్రమంగా రాలిపోతుంటుంది. ఇది క్యాన్సర్ బాధితులను మరింత కుంగ దీస్తుంది. అలాంటి క్యాన్సర్ బాధితుల కోసం చాలా మంది తమ కురులను దానం చేస్తుంటారు. ఇందులో సినిమా తారలు కూడా ఉన్నారు. అలా కొన్ని రోజుల క్రితం ఓ టాలీవుడ్ హీరోయిన్ ఒకరు క్యాన్సర్ బాధితుల కోసం తన కురులను దానం చేసింది. ఇప్పుడు మళ్లీ తనకు కొత్త జుట్టు వచ్చిందంటూ ఒక అందమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిప పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా?

టాలీవుడ్ నటి అభినయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాట‌, వినికిడి శ‌క్తి లేక‌పోయినా త‌న టాలెంట్‌తో మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. 2008లో తెలుగులో వచ్చిన ‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అభినయ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబులకు చెల్లిగా నటించి తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది. ఆ తర్వాత కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, రాజుగారి గది 2, సీతా రామం, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఏప్రిల్ లో తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్ ను పెళ్లి చేసుకుంది అభినయ. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఆస్వాదిస్తోన్న ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేశానని అందులో పేర్కొంది. ఇప్పుడు కొత్త కురులతో కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపింది. అంతకు మించి క్యాన్సర్ రోగుల కోసం తన జుట్టును దానం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఎమోషనలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?